2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామిని గత సంవత్సరం అక్టోబర్ నుండి  యువనేస్తం నిరుద్యోగ భృతి పేరుతో ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. 13 లక్షల నిరుద్యోగులు భృతి కొరకు అప్లై చేసుకోగా ఇందులో 5 లక్షల నిరుద్యోగులు ఈ పథకానికి అర్హత పొందారు. అర్హత పొందినవాళ్ళు పిబ్రవరి నెల వరకు వెయ్యి రుపాయలు భృతి పొందారు. మార్చి నెల నుండి ఈ భృతిని రెండు వేల రుపాయలకు పెంచారు.

కానీ ప్రస్తుతం ఆంధ్ర్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో ఈ పథకం కొనసాగుతుందో లేదో అనే ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొంది. ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి యువనేస్తం నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ఈ పథకం అమలుపై సందేహాలు నెలకొన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ నెలలోగా 4 లక్షల గ్రామ వాలంటీర్లను నియమిస్తానని చెప్పడంతో ఈ పథకం కొనసాగిస్తాడో లేదో తెలియట్లేదు. 

ఈ పథకం గురించి కస్టమర్ కేర్ నంబర్ 1100 ను సంప్రదించగా ఇంకా ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. ఈ పథకం కొనసాగిస్తే బాగుంటుందని ఇంటర్వ్యూలకు ప్రభుత్వ పరీక్షలకు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉందని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: