విజయవాడ ఎంపీ కేశినేని నాని అడుగులు వడివడిగా బీజేపీ వైపు పడుతున్నాయా? అంటే అవుననే టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది . నాని ఇటీవల బీజేపీ సీనియర్ నాయకుడు గడ్కరీ తో సమావేశమై పార్టీ లో చేరేందుకు మంతనాలు జరిపారన్న ఊహాగానా లు జోరుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ నేపధ్యం లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయనకు అప్పగించిన పార్లమెంటరీ విప్  పదవిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి నాని ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చా రు . విజయవాడ ఎంపీగా రెండవసారి గెల్చిన నాని కి పార్లమెంటరీ విప్ పదవిని కట్టబెడుతూ చంద్రబాబు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.  నానికి ఆ పదవి లో కొనసాగడం ఇష్టం లేకపోతే నేరుగా అధ్యక్షుడికి తెలియజేయడమే, పార్టీ పెద్దలకు సమాచారం అందించాల్సింది పోయి, ఏకంగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి ఆయన విప్ పదవిని తిరస్కరించడం పై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. 

పార్టీ లో కొనాసాదం ఇష్టం లేకనే నాని ఈ విధంగా వ్యవహరించి ఉంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం మూట కట్టుకున్నప్పటి నుంచి పార్టీ లోని కొంతమంది నేతలు ఎదో ఒక సాకు చూపి పక్క పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు . అందులో నాని మినహాయింపేమీ కాదని పేర్కొంటున్నారు . ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని, లేకపోతే తాను హాజరయ్యేవాడినని పేర్కొనడం ద్వారా నాని తన మనస్సులోని మాటను పరోక్షంగా వెల్లడించినట్లయిందని రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

టిడిపి నేతలను ఎవర్ని  ప్రస్తుతం  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చుకునే పరిస్థితి లేకపోవడం తోనే నాని లాంటి నాయకులు బీజేపీ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే పార్టీ నాయకత్వం అప్పగించిన పదవిని బహిరంగానే తిరస్కరించడం ద్వారా తమ భవిష్యత్తు పయనమెటు స్పష్టమైన సంకేతాలనిచ్చినట్లయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత నాని చర్యల వల్ల టిడిపి లోను ఆయన పై అనుమానపు చూపులు మొదలయ్యాయని అంటున్నారు. ఒకవేళ టిడిపి లో ఆయన కొనసాగిన ప్రతినిత్యం తన సచ్చిలతను రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: