తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గా పనిచేస్తున్నారనే వార్తలు రావడంతో నితీష్ కుమార్  సీరియస్ అయ్యారు.  దీనిపై ఆయన స్పందించారు.  పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో ప్రశాంత్‌ కిశోర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయంపై తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. 


ఆదివారం జేడీయూ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రశాంత్‌ కిశోర్‌ కూడా హాజరవుతారు. తాజా విషయంపై అక్కడ ఆయన మాట్లాడతారని సమాచారం.   ప్రశాంత్‌ కిశోర్‌కు ఓ సంస్థ ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే అది పనిచేస్తుంది. ఎవరి కోసం ఆ సంస్థ పని చేస్తుందో ఆయనకే తెలియాలి. అయితే ప్రశాంత్‌ కిశోర్‌ తీసుకున్న నిర్ణయాలతో పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని నితీష్ తెలిపారు. 


తృణమూల్‌ కాంగ్రెస్‌తో కిశోర్‌ ఒప్పందం కుదుర్చుకోవడం నీతీశ్‌కుమార్‌కు మింగుడు పడడం లేదు. భాజపాతో మిత్రపక్షంగా కలిసి పనిచేస్తున్న జేడీయూకు చెందిన కీలక నేత.. భాజపాకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వెళ్తారన్న వార్తలే ఇందుకు కారణం. 


ఎలాగైనా బీజేపీ పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని చూస్తోది.  కానీ, బీజేపీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ మమతా కోసం పనిచేస్తున్నారని తెలియడంతో ఈ రగడ ప్రారంభమైంది.  గతంలో ఈయన మోడీ, నితీష్ కుమార్ ల కోసం పనిచేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: