నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం ఇప్పుడు క‌నీసం మంత్రిగా కూడా అనుభ‌వం లేని న‌వ‌యువ‌కుడి ముందు చిన్న‌బోయింది. మాట మాట‌కు ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని గొప్పులు చెప్పుకునే చంద్ర‌బాబు జ‌గ‌న్ చేతిలో ఘోర‌మైన ఓట‌మి త‌ర్వాత ఇళ్లు విడిచి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి. చివ‌ర‌కు పార్టీ నేత‌లు ఆయ‌న్ను క‌లిసేందుకు వెళ్లినా ఏదో ముభావంగా ఉంటున్నార‌ట‌. అన్నింటికి మించి జ‌గ‌న్ చేతిలో ఓడిపోవ‌డం క‌న్నా ఇప్పుడు ఆయ‌న తీసుకుంటోన్న నిర్ణ‌యాలు.. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌కు రాష్ట్ర ప్ర‌జ‌లు, ఇత‌ర పార్టీల నేత‌లు కూడా అన్నింటికి అతీతంగా జేజేలు ప‌ల‌క‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌.


ఇలాంటి మంచి ఆలోచ‌న‌లు త‌న‌కు ఎందుకు త‌ట్ట‌లేద‌ని ఆయ‌న బాధ‌ప‌డుతున్నారా ?  లేదా ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే వ‌చ్చే ట‌ర్మ్‌లో కూడా త‌న‌కు అధికారం క‌లే అని బాధ‌ప‌డుతున్నారా ? అన్న చ‌ర్చ‌లు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. జ‌గ‌న్ ప్ర‌తి విష‌యంలో సంచ‌ల‌న‌మే క్రియేట్ చేస్తున్నాడు. మంత్రివ‌ర్గ కూర్పు, శాఖ‌లు, ఇత‌ర ప‌ద‌వులు, కేబినెట్ నిర్ణ‌యాలు ఇలా ఏది చూసినా సంచ‌ల‌న‌మే అవుతోంది. జ‌గ‌న్‌కు గెలిచిన‌ప్ప‌టి కంటే ఇప్ప‌టికి క్రేజ్ రెండింత‌లు అయ్యింది. ఇదే చంద్ర‌బాబుకు తీవ్ర‌మైన అక్క‌సుగా మారింది.


చంద్ర‌బాబుకు, ఆయ‌న చుట్టూ ఉన్న వందిమాగ‌ధుల‌కు ఆయ‌న గుడ్ అడ్మినిస్ట్రేట‌ర్ అని చెప్పుకోవ‌డం గ‌త రెండు ద‌శాబ్దాలుగా అల‌వాటుగా మారింది. ఇప్పుడు జ‌గ‌న్ వ‌చ్చి వారం రోజుల్లో చేసి చూపిస్తోన్న ప‌నుల‌కు బాబు మానిప్యులేట‌ర్ అన్న విష‌యం ఆయ‌న సొంత పార్టీ నేత‌లు, ఆయ‌న అనుంగు అనుచ‌రుల‌కే అర్థ‌మైంది. దీంతో వాళ్లు క‌క్క‌లేక, మింగ‌లేక చందంగా త‌మ ఆవేద‌న ఎవ‌రికి చెప్పుకోవాలో ?  తెలియ‌క విల‌విల్లాడుతున్నారు.


అంతెందుకు తమ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచాలని ధర్నా చేసిన ఆశా వ‌ర్క‌ర్ల బాధ‌లు ఆయ‌న ప‌ట్టించుకోలేదు. జ‌గ‌న్ హామీ మేర‌కు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ.10 వేలు చేశాడు. ఈ పెంపు వాళ్లు కూడా ఊహించ‌లేదు. జగన్ కేబినెట్లో 60% మంత్రులు అణగారిన వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నారు. దేశంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక బీసీల‌ను అడ్డం పెట్టుకుని రెండు సార్లు ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు వాళ్ల అభివృద్ధికి ఏనాడు బాస‌ల‌గా నిల‌వ‌లేదు.


జ‌గన్ బీసీలకు 50% నామినేషన్ పనులు కేటాయించి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఇక జ‌గ‌న్ ఏకంగా ఏడుగురు బీసీల‌ను లోక్‌స‌భ‌కు పంపారు. క‌నీసం మంత్రిగా కూడా అనుభ‌వం లేక‌పోయినా ప్ర‌తి ప‌ని విష‌యంలో ఎంతో క్షుణ్ణంగా ఆలోచించి మ‌రీ జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడు. చంద్ర‌బాబు చేసేది గోరంత అయితే ఆయ‌న ప్ర‌చారం కొండ‌త అన్న‌ట్టుగా ఉండేది. ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం ఎలాంటి హ‌డావిడి లేకుండా త‌న‌ప‌ని తాను చేసుకుంటూ వెళుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: