గ్రామ సచివాలయం ఇది కొత్తగా జగన్ సర్కారు అమల్లోకి తీసుకురానున్న  సరికొత్త నిర్ణయం..   ఆంధ్రప్రదేశ్ పల్లెల తల రాతలు మార్చే నిర్ణయం దీన్ని చాలా మంది భావిస్తున్నారు.  అయితే  ఈ గ్రామ సచివాలయం ఏంటి..  అందులో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి.. ఓ సారి చూద్దాం.

 

ఒక పంచాయతీ పరిధిలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తారు.  ఇందులో పది మంది ఉద్యోగులు ఉంటారు.  వీరందరిని ఆ గ్రామ  పరిధి నుంచే  ఎంపిక చేస్తారు.   ఈ ఉద్యోగాలు ఏమిటంటే..  విలేజ్ రెవెన్యూ ఆఫీసర్,  విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్,  ఏఎన్ఎం,  ఫీల్డ్ అసిస్టెంట్లు ఇద్దరు,  వ్యవసాయ శాఖకు చెందిన ఎంపీఈఓలు ఇద్దరు   ఉంటారు.

 

 

వీరితో పాటు అడవి శాఖకు చెందిన ఫారెస్ట్ వాచర్,  పశుసంవర్థక శాఖకు చెందిన గోపాలమిత్ర,  విద్యుత్ శాఖకు చెందిన లైన్ మెన్  కూడా  గ్రామసచివాలయ ఉద్యోగులు. 

వి ఆర్ ఓ,  వీఆర్ఏ,   ఏఎన్ఎం,   ఎం పీ ఈ ఓ,  ఫారెస్ట్ వాచర్,  గోపాలమిత్ర,  లైన్ మెన్ సెక్స్ వీడియో ఉద్యోగాలను జిల్లా కమిటీ రాత పరీక్ష ద్వారా నియమిస్తుంది.   ఈ ఉద్యోగాల  నియామకంలో 70 శాతం స్థానికులకు ప్రాధాన్యం ఇస్తారు .

 

గ్రామ  వాలంటీర్ ఉద్యోగాలకు పట్టణాల్లో డిగ్రీ అర్హత.  గ్రామాల్లో ఇంటర్  అర్హత.  గిరిజన పంచాయతీల్లో  పదో తరగతి   అర్హత.  గ్రామ వాలంటరీ ఉద్యోగాలను మండల కమిటీ నియమిస్తుంది.  ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు.  మార్కుల మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: