మిగతా వాళ్ళు ఏమోగానీ, దెబ్బకు దెబ్బ తీయడంలో రాజకీయనాయకులు ఎప్పుడు ముందుగానే ఉంటారు.  ఎక్కడ అవకాశం దొరుకుతుందా.. దానిని సద్వినియోగం చేసుకొని దూసుకుపోదామా అని ఆలోచిస్తుంటారు.  మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ కోర్టులో ఉన్న బాల్, ఇప్పుడు వైకాపా కోర్టులోకి వచ్చింది. 

మరి ఈ అవకాశాన్నివదులుకుంటారా  చెప్పండి.  ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోరు.  అందుకే ముందు టీడీపీని ఆర్ధికంగా ఆదుకుంటున్న నారాయణ విద్యాసంస్థలపై కన్నేసింది.  ఎలాగైనా ఆర్ధికంగా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంది.  

ఇందులో భాగంగానే నారాయణ విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అయ్యింది.  విద్యాశాఖ అనుమతులు లేని శాఖలపై విరుచుకుపడుతోంది.  ఇప్పటికే అనుమతులు లేకుండా నడుపుతున్న నారాయణ స్కూల్స్ రెండింటిని సీజ్ చేసింది.  లక్షరూపాయల ఫైన్ ను వేసింది.  

ప్రైవేటు కాలేజీలు.. స్కూళ్లకు సంబంధించి ఫీజుల నియంత్రణకు కమిషన్ వేయటంతో పాటు అర్హులైన పేదలందరికి అమ్మ ఒడి ద్వారా ఆదుకుంటామని జగన్ ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి కేబినెట్ సమావేశంలోనే విద్యాశాఖ సంస్కరణలపై రెగ్యులరేటరి కమిషన్ ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.  మాటలే కాదు చేతల్లోనూ స్పీడే అన్న విషయం ఈ ఉదంతంతో తేలిపోయింది.  జగన్ దూకుడు ఇలాగే కొనసాగితే.. ప్రయివేట్ స్కూల్స్ కు చెక్ పడ్డట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: