ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం  జరగబోతుందా తెలుగుదేశం పార్టీప్రతిపక్ష హోదా  కోల్పోతుందా..  త్వరలోనే ఏపీలో ఏపీలో  ఉప ఎన్నికలు  రాబోతున్నాయా..   అంటే సమాధానం అవుననే వస్తోంది.

 

తెలుగుదేశం పార్టీలో ఇక భవిష్యత్తు లేదని నిర్ధారణకు వచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు త్వరలో వైసీపీలో చేరనున్న తెలుస్తోంది.  వీరితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారే అవకాశం ఉంది.  ఈ మేరకు నేతలంతా ఇప్పటికే జగన్ తో  టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

 

ఈ సంచలన విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక  టీవీ  చర్చలో  వెల్లడించారు.  ఈ విషయము ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.   పార్టీ ఫిరాయింపులు ఎంతమాత్రం  ప్రోత్సహించేది లేదని  జగన్ అసెంబ్లీ లో చెప్పిన కొన్ని గంటల్లోనే  ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.

 

జగన్ చెప్పిన మాట ప్రకారం తెలుగుదేశం ఎమ్మెల్యేలు వైసిపి లోకి రావాలంటే రాజీనామాలు చేసే రావాలి. అదే జరిగితే   త్వరలోనే ఎనిమిది చోట్ల ఉప ఎన్నికలు రావడం ఖాయం.  ఎనిమిది మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఖాయం.  ఏది ఏమైనా కోటం రెడ్డి  ప్రకటన పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: