ఇప్పుడు స్వచ్ఛమైన రాజకీయాలు ఎక్కడా కనిపించడం లేదు.  ఎక్కడ చూసినా కుళ్ళు కుతంత్రాలు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం.. ఎలా గెలవాలా అని ఆలోచించడం.. ప్రతి మనిషి ఇలాగే ఆలోచిస్తున్నాడు.  అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగాని, శాశ్వత శత్రువులు గాని ఉండరు అని.  ఒక పనికోసం కలిసి పనిచేస్తారు.  పని పూర్తయ్యాక విడిపోతారు.  మరొకరితో కలిసి పనిచేస్తారు.  

పని మిత్రులతో చెయ్యొచ్చు.. శత్రువులతో కలిసి చెయ్యొచ్చు.  ఇలాంటి రాజకీయాలను బాగా వంటపట్టించుకున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్.  ప్రశాంత్ కిషోర్ కు ప్రచార వ్యూహకర్తగా మంచి పేరుంది. 2014లో మోడీ విజయంలో కీలక పాత్ర పోషించారు.  తరువాత బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ విజయంలో ఎంతగానో తోడ్పడ్డాడు.  ఈ విజయం తరువాత ప్రశాంత్ కిషోర్ కు నితీష్ కుమార్ జెడియు ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టింది.  

రీసెంట్ గా ప్రశాంత్ కిషోర్ వైకాపాకోసం పనిచేశారు.  వైకాపాను విజయంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర తిరుగులేనిదని చెప్పాలి.  ఎన్నికలు పూర్తైన వెంటనే ప్రశాంత్ కిషోర్.. కాబోయే ముఖ్యమంత్రి జగన్ అని చెప్పాడు.  చెప్పినట్టుగానే జరిగింది.  వైకాపాగురించి, జగన్ నుంచి సోషల్ మీడియాలో, వార్తల్లో ఉండే విధంగా చూశారు.  ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి తప్పొప్పులను సరిదిద్దారు.  వైకాపా విజయం తరువాత ప్రశాంత్ పశ్చిమ బెంగాల్ కోసం మమతా తరపున పని చేయడానికి ఒప్పందం కుదిరింది.  

2024 లో ప్రశాంత్ కిశోర్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తరపున పనిచేసేందుకు ఒప్పందం జరిగినట్టు సమాచారం.  ఈ విషయాన్ని ఓ జాతీయ న్యూస్ ఛానల్ ప్రకటించింది.  ప్రశాంత్ కిషోర్ సక్సెస్ ఫుల్ ప్రచార వ్యూహకర్తగా పేరుంది.  మరి 2024 లో ప్రశాంత్ వ్యూహాలు ఫలిస్తాయా.. మరో పదేళ్ళపాటు రాష్ట్రంలో వైకాపానే ఉంటుందని అంటున్న వైకాపా శ్రేణులకు ఇది పెద్ద షాకింగ్ అనే చెప్పాలి.  రాజకీయ భాషలో చెప్పాలి అంటే వెన్నుపోటే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: