నామినేటేడ్ పదవుల్లో కొనసాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.  ఇలాంటి నామినేటెడ్ పదవుల్లో ముఖ్యమైనది టిటిడి చైర్మన్ పదవి.  నామినేటెడ్ పదవులు అనగానే ముందుగా ముందుగా అందరు కోరుకునేది ఇదే.  దీనికోసమే అందరు తాపత్రయపడతారు.  అలాంటి అవకాశమే టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా పుట్టా సుధాకర్ యాదవ్ కు వచ్చింది. 

 

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న సమయంలో ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యి.. వైకాపా అధికారంలోకి రావడం జరిగిపోయింది.  ప్రభుత్వం మారినపుడు నామినేటెడ్ పోస్టులలో ఉండే వ్యక్తులు మామూలుగానే రాజీనామాలు చేసి వెళ్ళిపోతారు.  ఇది ఆనవాయితీ. 

 

అదే విధంగా టిడిపి పాలకమండలిలోని సభ్యులు రాజీనామా చేశారు.  అయితే, టిటిడి చైర్మన్ మాత్రం ససేమిరా అన్నారు.  తన పదవి కాలం రెండేళ్లు ఉందని, ఇప్పుడు ఎలా రాజీనామా చేస్తానని పట్టుబట్టాడు.  దీంతో వైకాపా షాక్ తిన్నది. ఏం చేయాలో అర్ధం కాలేదు.  ఒకవేళ రాజీనామా చేయకుంటే.. ఆర్డినెన్స్ జారీచేసి పాలక మండలిని రద్దు చేస్తామని చెప్పింది. 

 

ఏమైందో ఏమో తెలియదుగాని, పుట్టా తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు.  ఇలా చేయడం వలన జగన్ కు మంచి జరిగింది.  ఎందుకంటే పుట్టా బిసి వర్గానికి చెందిన వ్యక్తి.  బిసి వ్యక్తి కాబట్టి... బీసీలు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది. కానీ, అలా కాకుండా పుట్ట తనంతట తానే రాజీనామా చేసి వెళ్లడం వలన ఈ విపత్తు నుంచి బయటపడ్డాడు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి: