ఎన్నికల రిజల్ట్ వచ్చిన నెలలోపే టిడిపిలో అసంతృప్తి మొదలు కావడం.. అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళిపోయాడు సిద్ధం అవుతున్న తరుణంలో.. పార్టీ మారే నేతలు తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వంపై విమర్శలు చేసేందుకు సిద్ధం అయ్యింది.  


పార్టీలో ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో అలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా.. లోకేష్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, ఫలితంగానే పార్టీ ఓటమి పాలైందని చెప్పి విమర్శలు చేయడం మొదలుపెట్టారు.  ఎలాగో పార్టీ మారుతున్నారు కాబట్టి... టీడీపీ నుంచి ఎలాంటి ఎదురుదాడి ఉండకూడదని భావించిన నేతలు ఈ విధమైన విమర్శలు చేస్తున్నారు.  


ఇదిలా ఉంటె, బీజేపీ పక్కా వ్యూహంతోనే ఈ విధమైన ప్లాన్ ను రెడీ చేసిందని, ఇలా చేయడం వలన ఫ్యూచర్ లో ఆ పార్టీ నుంచి ఇబ్బందులు తలెత్తకూడదు అనే అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  


పనిలో పనిగా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని, అలా చేస్తేనే పార్టీ భవిష్యత్తులో తిరిగి పుంజుకుంటుందని నేతలు అభిప్రాయ పడుతున్నారు.  లోకేష్ ను రాజీనామా చేయమంటే చేస్తారా చెప్పండి.  చేయడు కదా.  మరి ఇదంతా ఎందుకు అంటే అంతే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: