విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫేస్బుక్ వేదికగా ఇటీవల బాగా సెటైర్లు వేస్తున్నారు.  మొన్నటికి మొన్న సొంత పార్టీ అధినేతపై   ఘాటు పదజాలంతో పోస్టులు పెట్టారు.  సొంత పార్టీ నేతల పైనా సెటైర్లు వేస్తున్నారు.

 

తాజాగా సొంత పార్టీ పై విమర్శలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కేసినేని ఇప్పుడు జగన్ పరిపాలన పై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.  ప్రజా వేదిక కూల్చివేత అంశంపై వరుసగా పోస్టులు పెడుతున్నారు.  కూల్చివేతను సపోర్ట్ చేస్తూనే ప్రైవేట్ భవనాలు కూల్చిన తర్వాత... చివరిగా ప్రజా వేదిక కూల్చాలని సూచించారు.

 

మరోసారి కేసినేని నాని  ప్రజావేదిక కూల్చివేత అంశం పై ఇవాళ సెటైర్లు పేల్చారు.. ఇంకా నయం... తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా లోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది. అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే... అంటూ  ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.

 

అంటే జగన్ యూపీ సీఎం అయ్యుంటే..  ఆగ్రా నది ఒడ్డున ఉన్న  తాజ్ మహల్ ను కూడా కూల్చేసే వారని అర్థం వచ్చేలా ఆ పోస్టు ఉంది.  సెటైర్ బాగానే ఉంది కానీ తాజ్ మహల్  కట్టిన షాజహాన్ కాలానికి ఇప్పటి చట్టాలు, నిబంధనలు లేవు అన్న సంగతి కేశినేని నానికి తెలియదా...?

 

మరింత సమాచారం తెలుసుకోండి: