సీనియర్ నటి దర్శకురాలు సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల మృతితో సినిమా ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ ఆవేదన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే కృష్ణను ఓదార్చేందుకు సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఇలా ప్రతి ఒక్కరు కృష్ణని ప‌రామ‌ర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే  మహేష్ బాబు వైఖరి ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 


అసలు మ్యాటర్ ఏంటంటే ఏపీ సీఎం హోదాలో జగన్మోహన్‌రెడ్డి కృష్ణను పరామర్శించేందుకు వెళ్లారు. అప్పుడు మహేష్ బాబు ఎక్కడా కనిపించలేదు. కనీసం సీఎం వస్తున్నాడని ముందస్తు సమాచారం ఉన్నా కూడా హాజరు కాలేదు. అదే ప్రతిపక్షనేత చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ వచ్చినప్పుడు మాత్రం మహేష్ వాళ్ళని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ టైంలో నాన్న కృష్ణ వెంటే ఉండి బాబు, బాలయ్యకు పరిస్థితి మొత్తం వివరించారు. ఇదే ఇప్పుడు మహేష్ పై జగన్ ఆగ్రహానికి కారణమైంది. 


చంద్రబాబు వచ్చినప్పుడు అన్ని దగ్గరుండి చూసుకున్న మహేష్ జగన్ వస్తే మాటవరసకైనా రారా అని నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే ఘట్టమనేని ఫ్యామిలీకి చంద్రబాబు కంటే వైఎస్ ఎన్నో మేళ్లు చేకూర్చారని.... పద్మాలయ స్టూడియో భూములను క్రమబద్దీకరించార‌ని.... మహేష్ బాబు సైనికుడు సినిమా  రిలీజ్ అయినప్పుడు వరంగల్లో జరిగిన గొడవలు కూడా వైఎస్ క్షమించారని జగన్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీ ఘట్టమనేని ఫ్యామిలీకి అంత చేస్తే ఇప్పుడు మహేష్ సీఎం హోదాలో జగన్ తమ ఇంటికి వస్తే రిసీవ్ చేసుకునే పద్ధతి ఇదేనా ? అని ప్రశ్నిస్తున్నారు. 


ఇక మహేష్ బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఎన్నికలకు ముందు వరకు వైసిపిలోనే ఉన్నారు. అయితే గుంటూరు ఎంపీ సీటు విషయంలో జగన్ తో విభేదించి ఆయన టిడిపిలో చేరిపోయారు. ఇక జగన్ ను సరిగా రిసీవ్ చేసుకోని మహేష్ ప్రతిపక్షనేత చంద్రబాబు వచ్చిన సమయంలో అన్ని తానై వ్యవహరించడంతో జగన్ ఫ్యాన్స్‌కు నచ్చినట్టు లేదు. అందుకే వారంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌హేష్‌ను ట్రోల్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: