2016 నవంబర్ 8 అర్ధరాత్రి దేశంలో సంచనలం జరిగిన రోజు.  ఆరోజు  ప్రధాని మోడీ సంచలనమైన ప్రకటనను చేశారు.  దేశంలో ఇప్పటి వరకు అమలులో ఉన్న 500, 1000 రూపాయల నోటును చెల్లదని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.  నల్లధనం, పన్ను ఎగవేత దారుల నుంచి డబ్బును వెనక్కి తీసుకురావడమే కాకుండా.. ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బు అందకుండా చేయాలన్నది లక్ష్యం.  


ఈ నోట్ల రద్దు కార్యక్రమంతో ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ప్రజలు.  ప్రభుత్వానికి పన్ను రూపంలో డబ్బులు చెల్లించారు.  ఈ డబ్బు చెల్లింపుతో అన్నిరకాల ఇబ్బందుల నుంచి బయటపడ్డారు.  ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా... మోడీ ఛరిష్మా మాత్రం తగ్గలేదు.  మరోమారు 2019 భారీ ఎత్తున గెలిపించారు.  


దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించగల వ్యక్తి మోడీ ఒక్కరే అని గుర్తించిన ప్రజలు ఆయనకు పట్టంగట్టారు.  గతంలో కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ ఇచ్చారు.  ఈసారి నవంబర్ 8 వ తేదీన మోడీ ఏం చేయబోతున్నారు.  ఎలాంటి సంచలన ప్రకటన చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.  


నోట్ల రద్దు లాంటి ఒక సంచలన ప్రకటన మోడీ ప్రభుత్వం నుంచి రాబోతున్నట్టు సమాచారం అందుతోంది.  ఆ ప్రకటన ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నది.  ఆ ప్రకటన తరువాత దేశం యొక్క స్వరూపం పూర్తిగా మారిపోతుందని, దేశ భద్రతకు సంబంధించిన అంశం అయ్యి ఉంటుందని అంటున్నారు.  మరి ఏం జరుగుతుందో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: