మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అఖండ విజయం సాధించాడు. ఆ విజయం ఏ ఒక్క కులం ఓట్ల వల్లో.. మతం ఓట్లవల్లో సాధ్యపడలేదు. కానీ గెలిచిన తర్వాత మాత్రం జగన్ ఒక కులంపై కక్ష కడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ కులంపై కక్షతోనే రిజర్వేషన్ అవకాశాలు లేకుండా చేశారని ఆ కులం నేతలు అంటున్నారు.


ఆ కులం ఏంటో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉండాలి. అదే కాపులు.. కాపులకు రిజర్వేషన్ లు సాద్యం కాదని ముఖ్యమంత్రి జగన్ అంటున్నారని, అది వారిపై ఉన్న కసి అని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంటున్నారు. జగన్ కాపులపై కక్ష కట్టాడని ఆయన చెబుతున్నారు.


జగన్ హామీల విషయంలో జగన్ మాట తప్పుతున్నారని కూడా ఆయన చెప్పారు. టిడిపి హాయాంలో కాపులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే యత్నం చేశామని జ్యోతుల నెహ్రూ అంటున్నారు. జగన్ మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదని ఆయన విమర్శిస్తున్నారు. కాపుల అండతోనే అధికారంలోకి వచ్చామనే విషయాన్ని జగన్‌ విస్మరించకూడదని జ్యోతుల హితవు పలుకుతున్నారు.


అంతగా అవసరమైతే కాపు రిజర్వేషన్‌ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వైకాపా ప్రభుత్వానికి తెదేపా సహకరిస్తుందని జ్యోతుల నెహ్రూ అంటున్నారు. అయితే అసలు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలేమిటి.. కాపులకు రిజర్వేషన్లపై కమిటీ పేరుతో ఏళ్లకు ఏళ్లు ఆలస్యం చేసిందెవరు.. చివరకు కేంద్రం ఇచ్చిన 10 శాతం అగ్రవర్ణ పేదల కోటాలో ఎలాంటి కసరత్తు చేయకుండా 5 శాతాన్ని కాపులకు కేటాయించిందెవురు..


ఇలాంటివి న్యాయస్థానాల్లో నిలబడవని తెలిసినా కాపు ఓట్ల కోసం 5 శాతం ఇచ్చిదెవరు..? ఈ ప్రశ్నలన్నింటీ సమాధానం టీడీపీ అనే వస్తుంది. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తే అది కోర్టుల్లో నిలబడని జగన్ నమ్మబట్టే 10 శాతం కోటాలో కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేదు. జిమ్మిక్కులు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: