సీఎం జగన్మోహన్ రెడ్డిగారు రెండు నెలలుగా పరిపాలన సాగిస్తున్న విధానం మిగతా పార్టీలకు షాక్ ఇచ్చేలా ఉందని తెలుస్తోంది. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. రాష్ట్రంలో 1,26,728 గ్రామ సచివాలయ ఉద్యోగాలకు వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కలలు కంటున్న నిరుద్యోగ యువత ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంత భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ఉండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
అక్టోబర్ 15వ తేదీ నుండి రాష్ట్రంలోని రైతులకు 12,500 రుపాయలు పెట్టుబడి సాయం అందించబోతుంది వైసీపీ ప్రభుత్వం. అమ్మఒడి పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపే ప్రతి పల్లికి 15,000 రుపాయలు 2020 సంవత్సరం జనవరి 26 వ తేదీ నుండి ప్రభుత్వం అందించబోతుంది. వృధ్ధాప్య పెన్షన్లు 2000 రుపాయల నుండి 2250 రుపాయలకు ప్రభుత్వం ఇప్పటికే పెంచింది. ప్రమాదవశాత్తు, ఆత్మహత్య చేసుకున్న రైతులకు 7 లక్షల రుపాయల భీమా అందిస్తోంది ప్రభుత్వం. 
 
రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే ఇచ్చేలా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించింది. ఈ బిల్లు వలన రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వబోతున్నాయి.విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం రెండు బిల్లులను ఆమోదించింది ప్రభుత్వం. జగన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుల వలన కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. 
 
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్లే విద్యకు సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షించబోతున్నాయి.స్కూళ్ళకు జరిమానా విధించటం, అవసరమైతే స్కూళ్ళను మూసివేసే అధికారం కూడా ఈ కమీషన్లకు ఉంది. ఇలా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర పార్టీలకు షాక్ ఇస్తున్నాయని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: