నయీమ్ ముఠా.. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ ను గడగడలాడించిన ముఠా.. సెటిల్ మెంట్లు, దందాలు, నేరాలు.. ఇలా నయీమ్ చేయని నేరం లేదంటారు. వేల కోట్ల సంపద పోగేసి.. చివరకు పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ అయ్యాడు.. కానీ ఆయన సంపాదించిన ఆస్తుల లెక్కలు మాత్రం ఇంకా తేలడం లేదు.


అంతే కాదు.. ఆయన నివాసాల్లో దొరికిన డైరీల్లో ఆయన తన ఆస్తుల చిట్టాలు.. ఎక్కడెక్కడ ఎంత సంపాదించిందీ.. ఎవరితో సంపాదించింది.. రాజకీయ లింకులు.. ఇలా అన్నీ రాసుకున్నాడని అప్పట్లో మీడియో ఘోషించింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఆ గుట్టు మాత్రం పోలీసులు విప్పడం లేదు.


ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా కొంత కీలక సమాచారం ఇటీవల బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన గాంగ్ స్టర్ నయీం తో సంబంధాలు ఉన్నవారి పేర్లు బయటకు వస్తున్నాయి. కొందరు పోలీసులతో ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబందాలు ఉన్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.


అలాగే కొందరు రాజకీయ నేతలకు కూడా నయీమ్ కు లింకులున్నాయి. సిట్‌ అధికారి నాగిరెడ్డి సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాచారం సంచలనం సృష్టిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్యతో పాటు భువనగిరి మాజీ జడ్పీటీసీ సుధాకర్‌, మాజీ కౌన్సెలర్‌ శ్రీనివాస్‌, వెలిగొండ మాజీ ఎంపీపీ వెలిగొండ నాగరాజు, భువనగిరి మాజీ ఎంపీపీ వెంకటేశ్‌, అబ్దుల్‌ నాజర్‌, భువనగిరి మాజీ సర్పంచి పింగళరెడ్డి, బొల్లి ఈశ్వరయ్య, వి. సంజీవ్‌ లకు నయీమ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయట. వీరితో పాటు 25 మంది పోలీసు అదికారులతోనూ లింకులు ఉన్నాయట.


ఇంతవరకూ బాగానే ఉంది. కానీ నయీమ్ ఎన్ కౌంటర్ జరిగిన మొదట్లో చాలామంది రాజకీయ నాయకులు పేర్లు బయటకు వచ్చాయి. మరి ఈ సమాచారంలో వారి పేర్లు లేవు. అంటే వారికి నయీమ్ ముఠాతో సంబంధాలు లేవా..?


మరింత సమాచారం తెలుసుకోండి: