బీజేపీ నార్త్ లో బలంగా నాటుకుపోయింది.  నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియాలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది.  అటు బెంగాల్లో కూడా బీజేపీ పాగా వేయడానికి పావులు కడుపుతున్నది.  ఉత్తర భారతదేశంతో పాటు ఇప్పుడు దక్షిణాదిన కూడా పాగా వేయడానికి బీజేపీ రెడీ అవుతున్నది.  దక్షిణ భారతదేశంలో ఇప్పటికే కర్ణాటకలో అడుగుపెట్టింది.  కర్ణాటక తరువాత తెలంగాణలో పాగా వేసేసేందుకు రెడీ అయ్యింది.  


తెలంగాణాలో ఇప్పటికే నాలుగు స్థానాలు గెలుచుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల కనీసం 10 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.  అలానే 2023 వ సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణాలో పాగా వేయాలని చూస్తోంది.  తెరాస ప్రభుత్వంపై  మొదలైంది.  ఈ వ్యతిరేకతను బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. 


అంతేకాదు, ఉత్తరాదిలో ఉపయోగించిన హిందుత్వ కార్డును ఉపయోగించి తెలంగాణాలో కూడా ఉపయోగించాలని చూస్తోంది.  ఉత్తరారదేశ్ లో అలహాబాద్ పేరును ఇటీవలే బీజేపీ ప్రభుత్వంప్రయాగరాజ్ గా మార్చింది.  ఇదే తరహాలో తెలంగాణాలో కూడా హిందుత్వ పేర్లను పెట్టేందుకు సిద్ధం అయ్యింది.  హైదరాబాద్ ను భాగ్యనగరంగా, నిజామాబాద్ ను ఇందూరుగాను, కరీంనగర్ ను కరినగరంగాను మార్చాలని చూస్తోంది. 


మహబూబ్ నగర్ కు పాలమూరుగాను పేరు పెట్టాలని చూస్తున్నారు.  ఒకవేళ ఈ పేర్లుకు కేంద్రం ఆమోదం తెలిపితే.. దీనిని సాకుగా చూపించి తెలంగాణాలో పాగా వేయాలని చూస్తోంది. తెలంగాణా ప్రజలు బీజేపీ హిందుత్వ మాయలో పడతారా అన్నది చూడాలి.  ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ పట్టుసాధించింది.  ఇదే విధమైన పట్టును మిగతా ప్రాంతాల్లోకూడా సాధించాలని చూస్తోంది.  కేవలం హిందుత్వ కార్డును మాత్రమే కాకుండా.. కేంద్రం అమలు చేసే పథకాల్లో ఎక్కువ భాగం తెలంగాణాకు వచ్చే విధంగా చూసేందుకు కూడా తమకు అనుమతి ఇవ్వాలని, ఒకసారి తెలంగాణాలో బీజేపీకి అవకాశం ఇస్తే.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ చెప్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: