జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తన బుద్దిని మార్చుకోవడం లేదు.  నిత్యం ఈ విషయంలో రగడ చేసేందుకు సిద్ధం అవుతూనే ఉన్నది.  ఇప్పటికే అనేకమార్లు ఈ విషయంపై పాక్ కు భారత్ వివరించినా.. ససేమిరా అంటోంది.  అంతటితో ఆగకుండా ఈరోజు పాక్ ప్రధాని ఇమ్రాన్.. సౌదీ అరేబియా యువరాజుతో ఫోన్ చేసి మాట్లాడారు.  కాశ్మీర్ అంశం గురించి ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడినట్టు తెలుస్తోంది.  కాశ్మీర్ విషయంలోను సౌదీ అరేబియా సపోర్ట్ ఇవ్వాలని కోరింది.  దీనిపై యువరాజు ఎలా స్పందించారు అన్నది తెలియాల్సి ఉన్నది.  


అక్కడితో ఆగకుండా అంతర్జాతీయంగా కాశ్మీర్ సమస్యను ప్రపంచానికి తెలియజేసేందుకు మీడియాను వినియోగించుకోవాలని చూస్తోంది.  దానికోసం ప్రత్యేకంగా మీడియాను ఏర్పాటు చేయాలనీ పాక్ భావిస్తోంది.  పాకిస్తాన్ సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియాను ఏర్పాటు చేసి.. ఆ మీడియా ద్వారా కాశ్మీర్ విషయాన్ని నిత్యం వార్తల్లో ఉండేలా చూడాలని తద్వారా ఇండియాను టార్గెట్ చెయ్యొచ్చని పాక్ వాదన.  దీనికోసం సమాచార  శాఖ సిద్ధం అవుతున్నది.  


ఇదిలా ఉంటె, ఒకవేళ పాక్ ఇండియాపై యుద్దానికి దిగితే.. సపోర్ట్ చేయాలని ఇప్పటికే పాక్ చైనాను అభ్యర్ధించింది.  దీనికి చైనాకూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.  ఇప్పటికే చైనా మిలటరీ ఆర్మీ కమిషన్ వైస్ చైర్మన్ పాకిస్తాన్ లోని రావుల్పిండిలో పర్యటిస్తున్నారు.  అక్కడ పాక్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వాతో సమావేశం అయ్యారు. పాక్ కు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి అనే విషయంపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.  మరోవైపు పాకిస్తాన్ త్వరలోనే ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో కాశ్మీర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించేందుకు సిద్ధం అవుతున్నారు.  


మీడియాను అడ్డం పెట్టుకొని అంతర్జాతీయంగా ఇండియాపై బురద జల్లేందుకు సిద్ధం అవుతున్నది.  మరి ఆ మీడియా పాక్ కు ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూడాలి.  ఇటు చైనా సహకారం పాక్ కు ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా అనుమానమే.  ఎందుకంటే .. చైనా పూర్తిగా వ్యాపార సంబంధమైన దేశం.. ఆ దేశానికి ఏదైనా లాభం ఉంటేనే ముందుకు అడుగు వేస్తుంది.  పాకిస్తాన్ తో లాంగ్ టైమ్ స్నేహం ఉంటె ఉండొచ్చు.. కానీ, ఆ స్నేహమే దేశానికీ చేటుగా మారితే చైనాకూడా డ్రాగన్ లా నిప్పులు చేరగడం ఖాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: