ఆర్టికల్ 370 రద్దు..తరువాత జమ్మూ కాశ్మీర్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.  జమ్మూలో ఇప్పటికే పరిస్థితులు చక్కబడ్డాయి.  అటు కాశ్మీర్ లో అదుపులోకి వస్తున్నాయి.  ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా.. కాశ్మీర్ కు చెందిన కామిని రాజ్ పుత్ ఇంట్లో మాత్రం ఆనందం వెల్లివిరిసింది.  కారణం.. కాశ్మీరేతర అబ్బాయిని వివాహం చేసుకోబోతుండటమే. కాశ్మీర్ కు చెందిన ఈ అమ్మాయి ఢిల్లీలో తన అత్త ఇంట్లో ఉండగా ఆ ప్రాంతానికే చెందిన అక్షయ్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది.  


ఆ పరిచయం ప్రేమగా మారింది.  గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.  ఎవరితోను చెప్పుకోలేని పరిస్థితి వీరిది.  కారణం.. కాశ్మీర్ అమ్మాయి వేరే రాష్ట్రాలకు చెందిన అబ్బాయిలను వివాహం చేసుకుంటే.. వారి ప్రత్యేక అధికారాలు కోల్పోవలసి వస్తుంది.  ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు.  ప్రత్యేక అధికారాలు వదులుకొని పెళ్లి చేసుకోవాలా లేదంటే విడిపోవాలా అన్న సందేహంలో ఉండిపోయారు. 

అయితే, ఆగస్టు 5 వ తేదీన వీరికి చల్లని వార్త అందింది.  ఆర్టికల్ 370 ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  అంతేకాదు జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది.  దీంతో ఈ ప్రేమ జంట ఆనందానికి హద్దులు లేవు.  అయితే, వీరి ముందున్న లక్ష్యం ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తునకు పెళ్ళికి ఒప్పించడం.  అందులో సక్సెస్ అయ్యారు.  కాశ్మీర్ అమ్మాయి మొదటిసారి వేరే రాష్ట్రానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నది.  రెండేళ్ల ప్రేమకు ఫలితం రాబోతున్నది.  


వీరి పెళ్లి అక్టోబర్ లో రాజస్థాన్ లో అబ్బాయి ఇంటిదగ్గర అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు.  రాజస్థాన్ వచ్చే అమ్మాయి తరపు కాశ్మీర్ బంధువుల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.  కాశ్మీర్ కు చెందిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటుండటంతో ఆ కుటుంబం ఆనందానికి హద్దులు లేవు.  మోడీ ప్రభుత్వం వలన ఇది సాధ్యం అయ్యిందని ప్రేమ జంట చెప్తున్నది.  వీరిలానే చాలామంది ప్రేమించుకున్న.. ఆర్ధిక అడ్డంకి కారణంగా విడిపోయారు.  ఇప్పుడు ఆ బాధలు ఉండవు.  కాశ్మీర్ అమ్మాయిని ప్రేమించవచ్చు.. కాశ్మీర్ లో ఇల్లు కొనుగోలు చెయ్యొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: