ఆర్టికల్ 370 రద్దు చేస్తున్న రగడ అంతాఇంతా కాదు.  వీలు దొరికితే చాలు ఇండియాపై బురద జల్లాలని చూస్తున్నది.  అంతర్జాతీయంగా ఇండియాను ఒంటరిని చేయాలని పన్నాగాలు పన్నుతున్నది.  దానికోసం వీలయితే ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉన్నది పాకిస్తాన్.  అంతర్జాతీయ వేదికలపై నిత్యం ఎదో విధమైన కామెంట్స్ చేయడం అభాసు పాలుకావడం జరుగుతూనే ఉన్నది.  


ఇటీవలే ఇలాంటి దృశ్యాలు ఎన్నో చూశాం.  మాల్దీవుల్లో జరిగిన పార్లమెంట్ స్పీకర్లు మీటింగ్ లో పాక్ డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు  దుమారం రేపాయి.  జరుగుతున్న సదస్సు గురించి మాట్లాకుండా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత పార్లమెంట్ స్పీకర్ ఆయనపై విరుచుకుపడ్డారు.  మాల్దీవుల పార్లమెంట్లో జరుగుతున్న ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న మాల్దీవుల పార్లమెంట్ స్పీకర్ పాక్ ఆరోపణలపై అభ్యంతరాలు తెలిపారు.  


సదస్సు గురించి మాట్లాడాలని హితవు పలికారు.  ఇదిలా ఉంటె, పాకిస్తాన్ కు చెందిన ఎంక్యూఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  కాశ్మీర్ అంశం ఇండియా అంతర్గత వ్యవహారం అని, ఆర్టికల్ 370 రద్దుకు పాకిస్తాన్ కు సంబంధం లేదని, పాక్ ఇండియా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకూడదని హితవు పలికారు. ఎక్కడిదో ఆగకుండా అయన సారే జహాసే  అచ్చా అని పాడటం విశేషం.  


ఇక పాకిస్తాన్ లో అక్కడి పాలన గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు.  పాకిస్తాన్ లో ప్రధాని, అధ్యక్షుడికి అధికారాలు పెద్దగా ఉండవని, ఐఎస్ఐ, ఆర్మీ చేతుల్లోనే అధికారులు ఉంటాయని, కేవలం వారు చెప్పినట్టుగా ప్రధాని చేయడమే అని అన్నారు.  దీన్ని బట్టి పాక్ లో ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయో అర్ధం అవుతున్నది. పైకి ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్నా.. లోపల జరుగుతున్నదంతా సైనిక పాలన కావడంతో ఆ దేశం అస్తిరత్వంతో కొట్టుమిట్టాడుతున్నది.  పాక్ కు చెందిన అల్తాఫ్ ఇలాంటి వ్యాఖ్యలు  చేసిన తరువాత కూడా పాకిస్తాన్ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటె మంచిది.  లేదంటే అది ఆ దేశానికే చేటు అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: