కరీబియన్​ దేశం బహమాస్​లో డోరైన్​ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి జనజీవనం స్తంభించింది. బలమైన ఈదురు గాలులకు ప్రజలు విలవిలలాడుతున్నారు. తుపాను వల్ల ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విపత్తు వల్ల 13వేల నివాసాలు ధ్వంసమయ్యాయి. అబాకో ద్వీపంలో వరదలకు తాగు నీరు కలుషితమైంది. విపత్తు తీవ్రత అధికంగా ఉండటం వల్ల సహాయక చర్యలు నిలిచిపోయాయి. వరదల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపాను నుంచి రక్షించమని ఓ రేడియో స్టేషన్​కు 2వేల సందేశాలు అందాయి.





డోరైన్​ తుపాను నేపథ్యంలో ప్రజలు తమ నివాసాలను విడిచి బయటకు రాకూడదని అధికారులు ఆదేశించారు. తుపాను తీవ్రత తగ్గే వరకు సహాయక చర్యలు చేపట్టలేమని స్పష్టం చేశారు. డోరైన్​ ధాటికి 7 మీటర్ల వరకు గాలివాన ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బహమాస్​ దేశస్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మరోవైపు డోరైన్​ తుపాను మంగళవారం అమెరికాలోని ఫ్లోరిడా తీరప్రాంతంవైపు ప్రయాణించే అవకాశముంది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారానికి వాయుగుండంగా ప్రమాదం ఏర్పడింది.





అల్పడీపనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సముద్రంలోని వాయవ్య పరిసర ప్రాంతాల్లో ఇది క్రమంగా బలపడుతోందని అధికారులు హెచ్చరించారు. ఇదే సమయంలో అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 7.6 కి. మీ ఎత్తులో నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: