పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుళ్ల  ఘటనపై  పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఈ పేలుడులో 23 మంది మృతి చెందగా, 27 మంది గాయపడడడం తనను తీవ్రంగా కలిచివేసిందని ట్వీట్‌ చేశారు. బుధవారం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా బటాలాలో  ఈ ప్రమాదంలో జరిగిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనపై మెజిస్టీరియల్‌ దర్యాప్తునకు సీఎం సింగ్ ఆదేశించారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.50,000, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25,000 చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. కాగా గురువారం గురునానక్‌ దేవ్‌ పెండ్లి మహోత్సవంతో పాటు పలు పండుగల నేపథ్యంలో కర్మాగారంలో కొన్ని రోజులుగా 24 గంటలపాటు పటాసులను పెద్ద ఎత్తున తయారీ చేస్తూ భారీగా నిల్వ ఉంచినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై గురుదాస్‌పూర్‌ ఎంపీ, బాలీవుడ్‌ నటుడు సన్నీడియోల్‌ విచారం వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బందితోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని ట్విట్టర్‌లో వెల్లడించారు.


ఫ్యాక్టరీకి చెందిన ఓ యజమానితో పాటు కార్మికులు, రోడ్డు మీదుగా వెళ్లే స్థానికులు ఈ ప్రమాదంలో మృత్యువాత పడినట్లు పోలీస్‌ అధికారులు పేర్కొంటున్నారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని, వీరిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. బటాలా-జలంధర్‌ రహదారిలోని హన్సాలీ పుల్‌ వద్ద ఉన్న రెండస్తుల ఫైర్‌క్రాకర్‌ ఫ్యాక్టరీలో సాయంత్రం 4 గంటలకు ఈ పేలుడు జరిగినట్లు బోర్డర్‌ రేంజ్‌ ఐజీ ఎస్‌పీఎస్‌ పర్మార్‌ మీడియాకు తెలిపారు. భారీగా నిల్వచేసిన పటాసులు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడినట్లు వివరించారు.  పేలుడు ధాటికి సమీపంలోని పలు భవనాలతోపాటు వాహనాలు దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు.  ఈ ఘటనలో 23 మంది చనిపోయారని, 27 మంది గాయపడ్డారని బటాలా సీనియర్‌ వైద్య అధికారి సంజీవ్‌ భల్లా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని అమృతసర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఫ్యాక్టరీకి చెందిన ఓ యజమానితో పాటు కార్మికులు, రోడ్డు మీదుగా వెళ్లే స్థానికులు ఈ ప్రమాదంలో మృత్యువాత పడినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని, వీరిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. 


భారీగా నిల్వచేసిన పటాసులు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడినట్లు వివరించారు. ప్రమాదానికి కారణం ఏమిటన్నది దర్యాప్తు తర్వాత నిర్ధారిస్తామన్నారు. 12 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపుచేసినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొన్నది. పేలుడు ధాటికి సమీపంలోని పలు భవనాలతోపాటు వాహనాలు దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు. ఈ ఘటనలో 23 మంది చనిపోయారని, 27 మంది గాయపడ్డారని బటాలా సీనియర్‌ వైద్య అధికారి సంజీవ్‌ భల్లా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని అమృతసర్‌ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఫ్యాక్టరీలో పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. నివాసాల మధ్య ఉన్న పటాకుల ఫ్యాక్టరీని మూసివేయాలని గతంలో పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: