ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే పంచాంగం చూసుకుంటారు.. ఏదైనా మంచి పని చేయాలి అంటే అదే పంచాంగం చూస్తారు.  ఈ పంచాంగంలో సూర్యమానం, చాంద్రమానం అనే రెండు రకాలు ఉంటాయి.  ఈ రెండు రకాలను ఒక్కోరకంగా ఫాలో అవుతుంటారు. అంటే చంద్రుని యొక్క స్థితిగతులపై మనిషి మనుగడ ఆధారపడి ఉంటుంది అన్నది మనవాళ్ళ నమ్మకం.  


అందుకే చంద్రుడు దేవుడయ్యాడు.. మనిషికి మూఢభక్తి పెరిగింది.  చంద్రుడి యొక్క స్థితిని బట్టి భోజనం చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు.  అలాంటి వాళ్లలో ఒకరు మహాత్మాగాంధీ గారి తల్లి.  చందమామను చూపించి చందమామ రావే జాబిల్లి రావే అంటూ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తుంటారు. అదే చందమామను చూస్తూ.. మామ చందమామ అంటూ పాటలు పాడుకుంటారు. ఇప్పటి యువతయితే.. దివి నుంచి దిగివచ్చి.. చందమామ లాంటి మానసిచ్చి అని పాటలు పడతారు.  


ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు.. చందమామను మనం  ఎన్నోరకాలుగా ఊహించుకొని మనకు అనుగుణంగా మార్చుకున్నాం.  దానిపై అడుగుపెట్టాం.  మనందరం కాదు.. కొందరు మాత్రమే అడుగుపెట్టారు.  అలాంటి చంద్రుడిపై భూమిపై ఉన్న వాతావరణాన్నిసృష్టించి.. ఆవాసయోగ్యంగా మార్చుకొని, అక్కడ విలాసవంతమైన ఇళ్లను కట్టుకుంటే ఎంత బాగుంటుంది.  వావ్ సూపర్ కదా. అలంటి రోజులు వస్తాయా..?


తప్పకుండా వస్తాయని అంటున్నారు మన శాస్త్రవేత్తలు.  చంద్రుని దక్షిణధృవంపై ఇస్రో ప్రయోగించిన ల్యాండర్ మరికొద్దిగంటల్లో ల్యాండ్ కాబోతున్నది.  ప్రపంచం యావత్తు ఆ దృశ్యం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.  ల్యాండర్ ల్యాండ్ అయ్యే దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రెడీ అయ్యింది.  చంద్రయాన్ 1 ఇప్పటికే అక్కడ నీళ్ల జాడలు ఉన్నట్టు కనుగొన్నది.  వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ప్రయోగాలు చేయడానికి రెడీ అయ్యింది.  నీళ్లు వినియోగానికి అనుకూలంగా ఉంటె.. మనం కూడా అక్కడ స్థలం కొనుక్కోవచ్చు.  ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: