మద్యం ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థలో  కీలకపాత్ర వహిస్తుంది. దేశంలో ఒక ఏడాదికి ఎక్కువగా లాభం ఆర్జించేది కూడా ఈ మద్యమే. రాష్ట్ర ఖజానాలో 60 శాతానికి పైగా ఆదాయం స్పదిస్తుంది అంటేనే ఈ మద్యం ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో అర్థంచేసుకోవచ్చు. అందుకే ప్రభుత్వం పై ఎన్ని విమర్శలు వచ్చినా , ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా ప్రభుత్వం మద్యం నిషేధం వైపు మాత్రం అడుగువేయలేదు. కానీ, ఇదే మద్యం ఎందరో జీవితాలని రోడ్డున పడేసింది. సాధారణ , మధ్యతరగతి కుటుంబాలు ఈ మద్యం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. 

కానీ , మొట్టమొదటిసారి అలనాటి స్టార్ హీరో ..ఆంధ్రుల ఆరాధ్యదైవం ..స్వర్గీయ సీఎం నందమూరి తారక రామారావు గారు ఈ మద్యపాన నిషేధానికి తెర తీసి అప్పట్లో ఒక సంచలనంగా మారారు. రాష్ట్రం ఎన్నికష్టాల్లో ఉన్నప్పటికీ  సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి చూపించారు. అన్నా అంటూ వచ్చిన అక్కచెల్లెమ్మల కన్నీటిని తుడుస్తూ మధ్య పానాన్ని నిషేదించారు. కానీ , ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ..ఆదాయం లో లోటు ఉండటంతో మళ్ళీ మద్యాన్ని అమలు చేసారు. ఆ తరువాత ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ మద్యపానాన్ని ఏ ప్రభుత్వం కూడా నిషేదించలేదు.

కానీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం. ఆ దిశగా అడుగువేస్తుంది. సీఎం జగన్ చేసిన ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా మద్యపానాన్ని పూర్తిగా నిషేధం చేస్తానని హామీ ఇచ్చాడు. ఒకేసారి మద్యాన్ని నిషేధం చేయడం కుదరదు అని, పలుధపాలుగా ఐదేళ్ల కాలంలో పూర్తిగా మద్యపానాన్ని నిషేధం చేసిన తరువాతే ఎన్నికల ప్రచారానికి వస్తా అని చెప్పాడు. దానికి తగ్గట్టే ... ప్రస్తుతం మద్యం షాపులని తగ్గించేశారు. అలాగే షాపులని కూడా ప్రభుత్వమే నడపనుంది. దీన్ని బట్టి చూస్తే ... ఎన్టీఆర్ తరువాత మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్న ఘనత జగన్ కే దక్కుతుంది.     


మరింత సమాచారం తెలుసుకోండి: