చిన్నప్పుడు స్కూల్లో మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఎవరైనా మాట్లాడుతూ కనిపిస్తే వాళ్లకి రూపాయి ఫైన్ అంటే అది ఒక రోజు రెండు రోజులు బాగానే నడుస్తుంది. కానీ మూడు రోజుల నుంచి ఎవరూ పట్టించుకోరు. మళ్ళీ మూడు నెలలకు అదే ఫైను మొదలుపెడతారు. అయినా దాంట్లో ఎటువంటి మార్పు రాదు. ఇప్పుడు మన భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ ఫైండ్ కూడా ఇలాగే తయారయ్యాయి. ఎన్నిసార్లు ఎటువంటి ఫైండ్ ప్రవేశపెట్టిన చిన్నపిల్లల తరహాలో మళ్ళీ షరా మామూలు కి వస్తూ ఉంటుంది.

హెల్మెట్ పెట్టుకోకపోతే ఒక ఫైన్ సిగ్నల్ దాటితే ఒక ఫైన్ అంటూ ఇలా ఫైనల్ రేట్ ను పెంచుతూ వెళ్తున్నారు కానీ దానికి ఎవరు బాధపడడం లేదు పైగా ఎవరు భయపడడం కూడా లేదు. వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు అలాగే కొనసాగించు కుంటున్నారు. అవసరమైతే ఫైన్ కట్టడానికి అయినా సిద్ధపడుతున్నారు కానీ వారికి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఇష్టపడడం లేదు.

ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఇక నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించని అన్నిటికీ కూడా వెహికల్ ఇన్సూరెన్స్ ను విపరీతంగా పెంచుతారు అట. ఇప్పటికే ఫైన్ మోత మోగిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఇకపై నుంచి ఇన్సూరెన్స్ రేట్ ను పెంచి దాని మీద కూడా బాదులు విధించే అవకాశం చాలా వరకు ఉంది. దీనిని ప్రజలు ఎంత వరకు పాటిస్తారు ఇంకా వేచి చూడవలసి ఉంది.

ఇన్సూరెన్స్ పెంపకం అనేది బండి కొనుక్కున్న అప్పటి నుంచే మొదలు అవుతుందా లేక మధ్యలో నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ ని పెంచి కట్టుకోవాలా అన్న అనుమానం అందరి లోని తలెత్తుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల బాగోగుల కోసం ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలి అని ప్రభుత్వం మన కోసమే ఈ మంచి తీసుకువస్తోంది అర్థం చేసుకోవాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: