తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషిస్తూ వచ్చారు. హైదరాబాద్ లో ప్రతిపక్ష పార్టీ నేతలతో జరిపిన భేటీలు పవన్ ఆలోచన వివిధానాన్ని వ్యక్తం చేస్తునట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మీద పవన్ ఇప్పుడు తన దృష్టిని తెలంగాణపై కేంద్రేకరిస్తున్నట్టుగా తాజా పరిణామాలు స్పష్టపరుస్తున్నాయి. ఇప్పటికే  అయన తన సంకేతాలను పంపించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన  తెలంగాణ ఎన్నికలకు ముందు ఏఐసిసి సీనియర్ నాయకులు వి. హనుమంతరావుకు తన మద్దతు పలికారు.


ముఖ్యంగా  వీహెచ్ ని తెలంగాణ రాష్ట్రానికి  కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తన మద్దతు ప్రకటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం తాజాగా వీరిద్దరి కలయిక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే విషయమై పవర్ స్టార్ పవన్అ కళ్యాణ్ అభిమానుల్లో  తర్జన భర్జనలు మొదలయ్యాయి.  ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని జనసేన కార్యాలయానికి వెళ్లిన హనుమంతరావు.. పవన్ కళ్యాణ్ తో గంటన్నరపాటు భేటి అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.



అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని వీహెచ్ కోరినట్టు సమాచారం. ఈ క్రమంలో వీహెచ్ పవన్ కళ్యాణ్ తో పలు అంశాలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ తో తెలంగాణలోని పలు అంశాలపైన కూడా వి.హనుమంతరావు చర్చించినట్లు తెలుస్తుంది.పార్టీ ఫిరాయింపులు, కాపు రిజర్వేషన్ల అంశం, తెలుగు రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు.. ఈ క్రమంలో ఆయన పోరాటానికి మద్దతు ప్రకటించినట్లుగా తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: