ఒకప్పుడు పల్నాడు పేరు చెప్తే భయపడిపోయేవారు.  రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎలా ఉంటాయో అంతకంటే ఎక్కువగా పల్నాడులో రాజకీయాలు ఉంటాయి.  తేడా వస్తే తలలు తెగి అవతల పడాల్సిందే.  గురజాల, దుర్గి, మార్చర్ల ఈ ప్రాంతాలన్ని ఒకప్పుడు ఇలాంటి రాజకీయాలకు ఫేమస్. నాగమనాయుడు, బ్రహ్మనాయుడు వంటి ఉద్దండులు తిరిగిన ప్రాంతం.  పల్నాడు నాయకురాలు నాగమ్మ తన ఎత్తులతో చిత్తులు చేసిన రాజకీయాలు మనకు పల్నాడులో కనిపిస్తుంది.  


కాలం మారింది.  1960 కాలం నుంచి పల్నాడులో నక్సలైట్ ఉద్యమం మొదలైంది.  అక్కడ నక్సలైట్స్ ఎక్కువుగా ఉంటారు.  బెల్లంకొండ, కారంచేడు, దుర్గి వంటి ప్రాంతాల్లో వీరి ప్రభావం ఎక్కువగా ఉండేది.  నల్లమల అటవీ ప్రాంతం దగ్గరగా ఉండటంతో వీరి అలజడులు ఎక్కువగా ఉండేవి.  అయితే, ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లపై కన్నేయడంతో.. చాలా వరకు వారి అలజడి తగ్గిపోయింది.  ఇప్పుడు ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటున్నది.  


అయితే, 2019 లో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పల్నాడులో తిరిగి ఉద్రిక్తలు మొదలయ్యాయి.  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారు.  భయపెడుతున్నారు.  ముఖ్యమట ఆత్మకూరుకు చెందిన వ్యక్తులు ఉన్నారు.  వారంతా రక్షణ కోసం అని తెలుగుదేశం పార్టీని సంప్రదించారు. వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు శిబిరాన్ని ఏర్పాటు చేసి వారిని అక్కడే ఉంచారు.  భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.  


ఈ నేపథ్యంలో చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది.  దీంతో పల్నాడులో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో మరోమారు అలజడులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.  పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.  తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర పోలీసులు మోహరించారు.  నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.  చంద్రబాబు, లోకేష్ లను హౌస్ అరెస్ట్ చేయడంతో మరింత ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: