రూపాయికే ఇడ్లి అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు కమలతాల్.. 80 ఏళ్ల వయసులోనూ ఆ బామ్మా ఎంతో ఓపికగా ఉదయాన్నే లేచి 1000 ఇడ్లీలు తయారు చేస్తుంది.  లాభాపేక్ష చూసుకోకుండా రూపాయికి ఇడ్లి అందిస్తుంది.  వచ్చిన పెట్టుబడి పోగా ఎదో కొద్దిగా మిగులుతుంది.  రుచికరమైన ఆమె ఇడ్లిని తినేందుకు వడివేలపాళ్యం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తుంటారు.  అలా వచ్చి ఆ బామ్మా చేతి ఇడ్లిలను తింటారంటారు.  ఏమి చేయకుండా ఇంట్లో ఊరికే కూర్చొని సినిమాలు చూస్తూ.. టీవీ సీరియళ్లు చూస్తూ ఉంటె వాళ్లకు ఆ బామ్మా ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.  


ఆ వయసులో కృష్ణారామ అనుకుంటూ కూర్చోకుండా తన కాళ్లపై తాను నిలబడుతూ కొంత సంపాదించుకుంటోంది.  పైగా పూర్వకాలం నాటి కట్టెలపొయ్యి మీదే వంట చేస్తుంది.  దానిమీద చేయడం వలనే రుచికరమైన ఇడ్లి తయారు అవుతాయని చెప్తోంది ఆ బామ్మ.  ఈ బామ్మా వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.  లక్షలమంది బామ్మను ఫ్యాన్స్ అయ్యారు.  ఆ బామ్మ ఎక్కడుందో తెలుసుకొని వెళ్లి ఆమె ఇడ్లి రుచి చేస్తున్నారు.


చాలామంది ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.  ఇక సోషల్ మీడియాలో నిత్యం అందుబాటులో ఉన్న వ్యాపారాదిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆ బామ్మ గురించి న్యూస్ చూశారట.  వెంటనే బామ్మ న్యూస్ ను ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.  ఈ బామ్మ చేస్తున్న పనికి హ్యాట్సాఫ్ చెప్పారు.  బామ్మ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నట్టు అయన పేర్కొన్నారు.  ఇది నిజంగా అభినందించదగిన విషయమే.  ఎందుకంటే.. ఒక చిన్న గ్రామంలో గత ముప్పై ఏళ్లుగా ఇడ్లి వ్యాపారం చేస్తున్న బామ్మ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఫేమస్ అయ్యింది.  ఆనంద్ మహీంద్రా వంటి వ్యాపారవేత్తలు బామ్మ వ్యాపారంలో పెట్టుబడి పెడతా అంటున్నారంటే హ్యాట్సాఫ్ చెప్పాలి. 


అటు ఇండియన్ ఆయిల్ సంస్థ కూడా ముందుకు వచ్చింది.  బామ్మకు ఆ సంస్థ తరపున గ్యాస్ స్టవ్, సిలిండర్, రెగ్యులెటర్ వంటికి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.  ఆనంద్ మహేంద్ర, ఇండియన్ ఆయిల్ వంటి సంస్థలు ముందుకు రావడంతో.. మరిన్ని సంస్థలు కూడా బామ్మ వ్యాపారానికి చేయూతను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు.  మరి బామ్మ వారి నుంచి సహాయ సహకారాలు తీసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉన్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: