ఈ విశాలమైన ప్రపంచంలో ఎన్నో విషయాలు,  సైన్సు సైతం నిరూపించలేని రహస్యాలు ఉన్నాయి.  సైన్సు పరంగా రుజువైన వాటిని మనం నమ్ముతాం.  సైన్సు ద్వారా కూడా నిరూపణ కాకుంటే దానిని భగవంతుడి లీల అని మెచ్చుకుంటాం.  అలాంటి భగవంతుడి లీలల్లో ఒకటి అజ్మీర్ దర్గాలో ఉంది.   అజ్మీర్ షరీఫ్ దర్గా.. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన దర్గా.  ఈ దర్గాను సందర్శించడానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.   ఈ దర్గాలో ఊహకు అందని అద్బుతం ఒకరి జరుగుతుంది. ఏంటి ఆ అద్బుతం అని ఆశ్చర్యపోతున్నారా.. అక్కడికే వస్తున్నా.. 


అజ్మీర్ దర్గాలో గాలిలో వేలాడుతూ ఉండే ఒక బండరాయి ఉన్నది.  భూమి నుంచి రెండు అంగుళాల ఎత్తులో ఈ బండరాయి వేలాడుతూ ఉంటుంది.  ఇలా ఎందుకు ఇది ఉన్నది అనే విషయాన్ని ఇప్పటి వరకు సైన్సు కూడా కనుక్కోలేక పోయింది.  ఈ బండరాయి కారణంగానే అజ్మీర్ దర్గా ప్రపంచవ్యప్తంగా ఫేమస్ అయింది.  


ఇకపోతే, అప్పట్లో రాజుగా ఉన్న అక్బర్ తనకు జహంగీర్ అనే కొడుకు పుట్టడంతో.. దానికి గుర్తుగా ఈ అజ్మీర్ దర్గా లోపల మజీదును నిర్మించారు.  అప్పటి నుంచి అక్కడ ముస్లింపిల్లలకు మతపరమైన విద్యను అక్కడ బోధిస్తున్నారు.  ఇక ఈ దర్గాలోపల రెండు పెద్దపెద్ద కుండలు ఉంటాయి.  వీటిని డెగ్స్  అంటారు. ఇందులో ప్రసాదం వండుతారు.  బియ్యం, నెయ్యి, చిరుధాన్యాలు, గింజలు, కుంకుమపువ్వు, చెక్కర వంటివాటిని ఉపయోగించి ప్రసాదం తయారు చేస్తారు.  అయితే, అక్కడ కేవలం శాఖాహారం మాత్రమే వండటం విశేషం. 

రాత్రి వండి ఉదయం దర్గాకు వచ్చే భక్తులకు దానిని ప్రసాదంగా ఇస్తారు.  ఇకపోతే, మరో ముఖ్యమైన విషయం ఉన్నది.  ఈ దర్గా తలుపును సంవత్సరంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే తెరుస్తారు.  ఈ దర్గా తలుపును జన్నతి దర్వాజా అంటారు.  వెండితో తాయారు చేసి ఉంటుంది.  ఉరుసు సందర్భంగా ఒకసారి, రంజాన్ సందర్భంగా రెండు సార్లు, ఖ్వాజా సాహెబ్ పీర్ ఉరుసు సందర్భంగా మరోసారి ఈ తలుపును తెరుస్తారు.  రాజస్తాన్ వెళ్ళే టూరిస్టులు తప్పకుండా ఈ దర్గాను సందర్శిస్తారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: