పాకిస్తాన్ అణుయుద్ధానికే మొగ్గు చూపితే భార‌త్ చేతిలో ప‌రాభ‌వం త‌ప్ప‌దా.. అందుకు పాకిస్తాన్ ముక్క‌లు చెక్క‌లు కాక త‌ప్ప‌దా...?  వాస్త‌వానికి 1971లో జ‌రిగిన సంఘ‌ట‌ల‌నే పున‌రావృతం కానున్నాయా.. అంటే అవున‌నే అంటున్నారు భార‌త ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌. అస‌లు పాకిస్తాన్ ముక్క‌లు చెక్క‌లు కావ‌డానికి 1971 సంఘ‌ట‌న‌ల‌కు, ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న సంఘ‌ట‌ల‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అంటే అవున‌నే అంటున్నారు ర‌క్ష‌ణ‌మంత్రి. పాకిస్తాన్ ఉగ్ర‌వాదాన్ని పెంచిపోషిస్తూ, హింస‌కు పాల్ప‌డి, అణుయుద్ధంకు మొగ్గు చూపితే పాకిస్తాన్ ముక్క‌లు కావ‌డం ఖాయ‌మ‌ని ర‌క్ష‌ణ‌మంత్రి స్ప‌ష్టం చేశారు.


భార‌త్‌లో స‌ర్వ‌మ‌తాల ప్ర‌జ‌లు క‌లిసి ఉండ‌టం పాకిస్తాన్‌కు సుతరాం ఇష్టం లేద‌ట‌. మ‌త రాజ‌కీయాల కోసం భార‌త్‌ను బ్రిటీష్ పాల‌కులు రెండుగా చీల్చారు.  పాకిస్థాన్ ప్రభుత్వ పాలసీల వల్ల 1971 యుద్ధం తర్వాత ఆ దేశం మళ్లీ రెండుగా విడిపోయిందట‌. . పాకిస్తాన్ కాశ్మీర్ పై ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే మ‌రోమారు పాకిస్తాన్ ముక్క‌లు కావ‌డం ఖాయం.. అక్క‌డ సింధీల‌కు, సిక్కుల‌పై దాడులు చేస్తున్నారు. బ‌లూచిస్తాన్‌లో ఉగ్ర‌వాదుల ఆగ‌డాలు ఆగ‌డం లేద‌ట‌.. ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే పాకిస్తాన్ ఛిన్నాభిన్నం కావ‌డం త‌థ్య‌మ‌ట‌.


పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ మానవ హక్కుల గురించి మాట్లాడటం మానేసి,  ఐరాసలో మానవ హక్కుల గురించి మాట్లాడ‌టం మానేసి ఆయన తన దేశంపై దృష్టిపెడితే బాగుంటుంద‌ని, యుద్దం గురించి ఆలోచ‌న‌లు మానుకుంటే వారికే మంచిద‌ని ర‌క్ష‌ణ‌మంత్రి హెచ్చ‌రించారు.  ఆర్టికల్ 370 రద్దును ఇమ్రాన్ జీర్ణించుకోలేకపోతున్నారని, ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితిని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి ఘోరంగా విఫలమ‌యి ఇప్పుడు అణుయుద్దం అంటూ కొత్త రాగం అందుకున్నాడ‌ట‌.


అణుయుద్దం చేస్తే మేమేమ‌న్నా చేతులు ముడుసుకుని కూసుంట‌మా.. అని ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి హెచ్చ‌రించాడు. అయితే ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి చెపుతున్న ప్ర‌కారం పాకిస్తాన్ వ్య‌వ‌హ‌రమే పాక్ ముక్క‌లు కావ‌డానికి దారి తీస్తుంద‌నే భావ‌న క‌లుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: