తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాద్ పార్థివ దేహాన్ని కార్యకర్తల సందర్శనార్ధం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు తీసుకురానున్నారు. భౌతిక కాయాన్ని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు తీసుకు వచ్చారు. పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దసంఖ్యలో ట్రస్ట్‌భవన్‌కు చేరుకుంటున్నారు. ట్రస్ట్‌భవన్‌కు వచ్చిన నందమూరి బాలకృష్ణ, కేఈ కృష్ణమూర్తి, దేవినేని, ఫారూక్‌ వంటి నాయకులు కోడెల భౌతిక కాయానికి నివాళులర్పించారు. నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ ఐదుసార్లు గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నుండి ఆరోవసా రి సత్తెనపల్లి నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నిక అయ్యారు.



గొప్ప శస్త్ర వైద్యుడిగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా  రాజకీయ సేవలు అందించిన శివ ప్రసాదరావు  విషాదకర మరణం పట్ల దిగ్భ్రాంతిని విచారాన్ని వ్యక్తపరిచారు.  టీడీపీకి తీరని లోటుగా ప్రకటిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని టీడీపీ శ్రేణులు వ్యక్తం చేశారు. 
రాత్రి 9.30గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్రస్ట్‌భవన్‌కు చేరుకోనున్నారు. విజయవాడ నుంచి రోడ్డుమార్గంలో చంద్రబాబు హైదరాబాద్‌కు బయలు దేరారు. కాగా కోడెల ఇంటికి మరోసారి పోలీసులు వచ్చారు. ఇప్పటికే ఆత్మహత్యకు పాల్పడిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తయింది. కోడెల ఉరివేసుకొని చనిపోయినట్లుగా ప్రాథమిక నివేదిక ఇచ్చారు. నలుగురు ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం ప్రక్రియను నిర్వహించారు. 




ఈ క్రమంలో  కోడెల పోస్టుమార్టం ప్రక్రియను పోలీసులు వీడియో చిత్రీకరించారు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని అల్లుడు మనోహర్‌కు వైద్యులు అప్పగించారు. అటు నుంచి అటే  కోడెల పార్థీవదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా బంజారాహిల్స్‌ ఏసీపీ కోడెల కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. కోడెల మేనల్లుడు బురగడ్డ అనిల్‌కుమార్‌ చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ, ఆంధ్ర పోలీసులు ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆధారాల సేకరణ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నారు. అలాగే ఘటనా స్థలంలో క్లూస్‌టీం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: