కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు బహుజనులు సిద్ధం కావాలని కొండా బాపూజీ ఆశయ సాధన సమితి  నిర్వాహకులు దాసు సురేష్ పిలుపు నిచ్చారు. ముఖ్యంగా  బాపూజీ మెమోరియల్ మార్చ్ కు అభిమానులు హాజరుకావాలని ఆశయ సాధన సమితి ఆహ్వానం మేరకు సెప్టెంబర్  21 న కొండా లక్ష్మణ్ బాపూజీ 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు వద్దగల పీపుల్స్ ప్లాజా నుండి జల దృశ్యం వరకు నిర్వహింప తెలపెట్టినట్టు తెలిపారు. బాపూజీ మెమోరియల్ మార్చ్ కు తెలంగాణా సీనియర్ నాయకులను , అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను , కుల సంఘాలను , కార్మిక సంఘాలను బాపూజీ అభిమానులను ఆహ్వానిస్తున్నట్లు కమిటీ చొఎఫ్ కోఆర్డినేటర్ దాసు సురేష్ , ఆహ్వాన కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ తాటికొండ వెంకట రాజయ్య మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమానికి సంభందించిన పోలీస్ పర్మిషన్ అందిందని , కార్యక్రమాన్ని నిర్వహియించే ప్రాంతాన్ని అన్ని కమిటీల ప్రతినిధులతో పరిశీలించి ఏర్పాట్లను వేగవంతం చేసినట్లు దాసు సురేష్ తెలియజేసారు.



బాపూజీ కలలుగన్న సామజిక తెలంగాణా సాధించే దిశగా బడుగు బలహీన మైనారిటీ వర్గాలు ఉత్సహంగా ముందుకు వస్తున్నాయన్నారు. ఇప్పటికే  కేశవరావు , ఉత్తమ్ కుమార్ రెడ్డి , కే లక్ష్మణ్ ,వివేక్ వెంకటస్వామి  వీహెచ్ హన్మంతరావు , ఆర్ క్రిష్నయ్య ,జేబీ రాజు , ఏ ఎల్  మల్లయ్య తదితర బాపూజీ సమకాలికులు కార్యక్రమంలో హాజరవుతున్నారని కార్యక్రమ నిర్వహణ కమిటీ ముఖ్యులు తెలియజేసారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు బహుజనులంతా కదంతొక్కాలన్నారు. ఆవిరవుతున్న బాపూజీ ఆశయాలను సజీవంగా ఉంచుకోవడానికి ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైదన్నారు. 



బాపూజీ మెమోరియల్ మార్చ్ కు తెలంగాణా వాదులంతా హాజరయ్యి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని  దాసు సురేష్ జలదృశ్యం వేదికగా పిలుపునిచ్చారు.  ఈకార్యక్రమానికి ప్రచార కమిటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్ యాదవ్ , వల్లూరి విజయ రామరాజు,గుండేటి శ్రీధర్ , ప్రొఫెసర్ గోవర్ధనం సుదర్శన్ రావు,ప్రొఫెసర్ ప్రొఫెసర్ వంగరి విశ్వ మోహన్ , దుడుకు గోవర్ధన్ అడ్వాకేట్లు బోయిన ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు  జలదృశ్యం ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బాపూజీ ఆశయ సాధన సమితి..ట్యాంక్ బండ్ పై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి , బాపూజీ అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని బాపూజీ విజ్ఞాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రతినబూనుతున్న ఆశయ సాధన సమితి సభ్యులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: