హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బొప్పాయి పండ్ల అమ్మకాల విషయంలో రైతులకు, దళారులకు మధ్య గొడవ జరిగింది. బొప్పాయి పండ్లను దళారులకు ఇవ్వకుండా రైతులు నేరుగా అమ్మకాలు జరుపుతున్నారు. అమ్మకాలు అడ్డుకున్న దళారులు రైతులపై దాడి చేశారు. రైతులతో దళారులు బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని బెదిరింపులకు దిగారు. 
 
దళారులు బెదిరించినప్పటికీ రైతులు తలొగ్గకుండా వారిపై దాడికి దిగారు. దళారుల దాడులు, రైతుల ప్రతిదాడులతో మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. గత కొన్ని రోజుల నుండి డెంగ్యూ వ్యాధి తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వ్యాధి విజృంభణతో బొప్పాయి పండ్లకు డిమాండ్ తీవ్రంగా పెరిగింది. బొప్పాయి పండ్ల ధరలు కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కేజీ బొప్పాయి 100 రూపాయల వరకు ధర పలుకుతోంది. 
 
బొప్పాయి పండ్లు తింటే ప్లేట్ లెట్స్ ఎక్కువగా పెరుగుతాయని ప్రచారం జరుగుతూ ఉండటంతో బొప్పాయి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. రైతులు పండించిన పంటను కొత్తపేట మార్కెట్ కు తీసుకొని వచ్చిన తరువాత దళారులు ధర బాగానే ఉన్నా అతి తక్కువ ధరకు ఇవ్వాలని రైతులను అడిగారు. దళారులు చెప్పిన ధర నచ్చని రైతులు ప్రజలకు నేరుగా అమ్మటం జరిగింది. 
 
పంట తమకు విక్రయించకుండా ప్రజలకు విక్రయిస్తూ ఉండటంతో దళారులు దాడి చేశారని తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు రైతులు గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాలను క్యాష్ చేసుకుందామని దళారులు భావించారు. పోలీసుల రంగ ప్రవేశంతో ప్రస్తుతం ఇక్కడ గొడవ ఆగిపోయింది. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా తక్కువ ధరలకే కొనుగోలు చేయాలనుకున్న దళారులపై అధికారులు చర్యలు తీసుకుంటే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: