గత కొంతకాలంగా పెరుగుతున్న ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్న విషయం తెలిసిందే. కూరగాయల మార్కెట్లో ఉల్లి రేటు ప్రస్తుతం 40 రూపాయల నుండి 50 రూపాయల మధ్య పలుకుతోంది. రాష్ట్రంలోని వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఉల్లి ధరలను తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిలో ఉల్లి కేవలం 25 రూపాయలకే అమ్మేలా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. 
 
రేపటినుండి రైతు బజార్లలో కిలో ఉల్లి 25 రూపాయల చొప్పున విక్రయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర నుండి 300 టన్నుల ఉల్లి కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం రైతు బజార్లలో కిలో ఉల్లి 25 రూపాయలకే విక్రయిస్తూ ఉండటంతో సామాన్యులకు కూడా ధరలు అందుబాటులోకి రాబోతున్నాయి. రెండు వారాలుగా పెరుగుతున్న ఉల్లి ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వ నిర్ణయంతో మేలు చేకూరనుంది. 
 
కిలో ఉల్లి 25 రూపాయలకే అందుబాటులోకి రావటంతో సామాన్యుల ఇబ్బందులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉల్లి ధరల గురించి మంత్రి మోపిదేవి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లాక్ మార్కెట్ కు ఉల్లిని ఎవరైనా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. అధికారులు మహారాష్ట్రలో ఉల్లి లభ్యత ఎక్కువగా ఉందని చెప్పటంతో అక్కడినుండి ఉల్లి తెప్పించాలని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. 
 
రాష్ట్రంలో వరదల వలన చాలా జిల్లాల్లో ఉల్లి పంట దెబ్బ తినటంతో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ఉల్లి విక్రయాలు ఎక్కువగా జరిగే కర్నూలు మార్కెట్లో ఉల్లి క్వింటా ధర 3,000 రూపాయలకు పైగా పలుకుతోందని సమాచారం. మరో 45 రోజుల్లో డిమాండ్ కు సరిపడేంత ఉల్లి లభ్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి రేటు 70 రూపాయల వరకు పలుకుతోందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: