ఏపి సీఎం జగన్ను తుగ్లక్‌గా అభివర్ణింస్తూ  నారా లోకేష్ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైసీపీ నేతల్లో మంట పుట్టిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు  వైసీపీ ప్రభుత్వం.. పైకి పోలవరం రివర్స్ టెండరింగ్ తో దాదాపు రూ. 700 కోట్లు ఆదా అని ప్రచారం చేస్తూ, తెరవెనక మాత్రం.. ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టుల రూపంలో పదింతలు పెంచి మేఘా సంస్థకు లబ్ది చేకూరేలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు.

ఇదే విషయమై సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. "అయ్యా, తుగ్లక్ ముఖ్యమంత్రిగారూ.. ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కట్టు కట్టించినట్టుంది మీ తెలివి అంటూ ట్వీట్ చేసారు.  పోలవరంలో ఖర్చులు తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచిన లాజిక్, రివర్స్ టెండర్ వెనకున్న అసలైన మేజిక్కని ప్రజలు అర్ధం చేసుకోలేని అమాయకులు కాదన్నారు  ''ఎడమ కాలు విరిగితే ఎర్రగడ్డ ఆస్పత్రిలో కట్టు కట్టించినట్లుంది మీ తెలివి'' అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.

 పోలవరంలో తగ్గించి.. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లలో పదింతలు పెంచిన లాజిక్.. రివర్స్ టెండర్ వెనకున్న అసలైన మేజిక్కని ప్రజలకు అర్థమైందంటూ పేర్కొన్నారు. స్వప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును అనుభవం లేని కంపెనీకి అప్పగించడం ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం అని హెచ్చరించారు.  రివర్స్ టెండరింగ్‌లో భాగంగా ప్రాజెక్టుపైకి చైనా 'మేఘా'లు కమ్ముకొస్తున్నాయంటూ సదరు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థనుద్దేశించి అన్నారు. ''ప్రకాశం బ్యారేజీ గేటుకు అడ్డంపడిన బోటు తీయడానికే వారం పట్టింది.

మొనట్టికిమొన్న గోదావరిలో మునిగిన బోటును రెండువారులుగా తీయలేక, 144 సెక్షన్ పెట్టారు'' అంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శనాస్ర్తాలు వేశారు. ''పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సవాల్ విసురుతున్న మంత్రిగారికి ఇది అలవాటైన విద్యేనేమో?.. అందుకే పోలవరంపైనా బెట్టింగ్ కాద్దామంటున్నారు'' అంటూ మంత్రి అనిల్‌పై కూడా  విమర్శులు చేశారు లోకేష్


మరింత సమాచారం తెలుసుకోండి: