దేశంలో కుల రాజకీయాలకు అడ్డా ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అని చెప్పొచ్చు. దశాబ్దాల కాలంగా ఏపీలో కులాల మీదనే రాజకీయాలు జరుగుతున్నాయి. అందులోనూ రెండు కులాల చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికారం కూడా ఈ రెండు కులాలే అనుభవిస్తున్నాయి. అలా అధికారం అనుభవిస్తున్న రెండు కులాలు ఏంటో ఈ పాటికే అర్ధమైపోయి ఉంటుంది.


అందులో ఒకటి టీడీపీకి మద్ధతుగా ఉన్న కమ్మ కులం కాగా, మరొకటి వైసీపీకి మద్ధతుగా నిలుస్తున్న రెడ్డి కులం. ఈ రెండు కులాలకు చెందిన నేతలే దశాబ్దాల పాటు అనేక కీలక పదవులు అనుభవించారు. ఇక ఇప్పుడు కూడా రాష్ట్రంలో  ఈ కులాల పంచాయితీ నడుస్తూనే ఉంది. మొన్నటివరకు అధికారంలో టీడీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల్లో గానీ, కీలక అధికార పదవుల్లో గానీ కమ్మ సామాజికవర్గం వారే ఎక్కువ ఉన్నారని వైసీపీ నేతలు విమర్శలు చేశారు.  


రాష్ట్రంలో కమ్మ రాజ్యం నడుస్తుందని ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ వచ్చారు. ఇక ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. దీంతో టీడీపీ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ప్రభుత్వంలో కీలక పదవుల్లో, సచివాలయంలో పదవుల్లో రెడ్డి సామాజికవర్గం వారే ఉన్నారని అంటున్నారు. మొత్తం రాష్ట్రంలో రెడ్డి డామినేషన్ సర్కార్ ఉందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే ఇరు పక్షాలు విమర్శలు చేసుకుంటున్న వీటిల్లో చాలావరకు వాస్తవాలు ఉన్నాయనే చెప్పొచ్చు.


టీడీపీ ఉన్నప్పుడూ కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చింది. దానికి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. అవి అందరికీ తెలుసు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా రెడ్డి సామాజికవర్గం వారికే ప్రాధాన్యత ఇస్తుందని తెలిసిపోతుంది. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ గానీ, ప్రభుత్వంలో కీలక పదవులు భర్తీ గానీ చూస్తే అది నిజమనే అనిపిస్తోంది. ఏది ఏమైనా రాష్ట్రాన్ని ఈ రెండు సామాజికవర్గాలే ఎక్కువ పాలిస్తున్నాయనేదే నిజం.


వీరి మధ్యలో వేరే కులం వస్తే ఏం అవుతుందో చిరంజీవి ప్రజారాజ్యం, పవన్ కల్యాణ్ జనసేనలని చూస్తే అర్ధమైపోతుంది. వాళ్ళకు కాపు ముద్రవేసి ఎలా చేశారనేది ప్రతిఒక్కరికి తెలుసు. ఆ కాపు ముద్రవల్లే అప్పుడు ప్రజారాజ్యం దెబ్బతింది...ఇప్పుడు జనసేనకు దెబ్బపడింది. మొత్తం మీద కమ్మ, రెడ్డి వర్గాలే రాష్ట్రంలో డామినేట్ చేస్తున్నాయి. మరి ఈ డామినేషన్ ఎంతకాలం సాగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: