తెలంగాణ రాష్ట్రంలో పండుగల సందడి మొదలైంది.   రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పండుగలకు హైదరాబాద్ నగరం నుంచి ఊర్లకు క్యూకట్టే వారి సంఖ్య పెరగనుంది. అయితే వివిధ ప్రదేశాలకు వెళ్లేందుకు విద్యార్థులు సిద్దమవుతున్నారు.  అంతే కాదు పండుగ సందర్భంగా తమ ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణీకులు సిద్దం కావడంతో తెలంగాణ ఆర్టీసీ ముందే మేల్కొంది. గతంలో ప్రయాణీకులకు కలిగిన ఇబ్బందులు ఈ ఏడాది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని యాజమాన్యం పేర్కొంది. 

ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. అంతే కాదు ప్రయానీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ రెండు స్టేషన్లలో నేటి నుంచి దసరా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది.

 కాగా, అక్టోబర్ 3 ఈ ప్రత్యేక సర్వీసులు కంటిన్యూ చేస్తామని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.  పండుగ రద్దీని తట్టుకునేందుకు మొత్తం 1,697 ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: