పసిపిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది.. అంతేకానీ చంపాలి అనే ఆలోచన రాదు.  అలాంటి ఆలోచన వచ్చింది అంటే వాళ్ళు మనుషులు కారు రాక్షసులు.  రాక్షసులు కూడా తమ తమ బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటాయి.  ఆకలేస్తే వేరే వాటిని చంపి ఆహారాన్ని తెచ్చుకుంటాయి తప్పించి సొంత వాటిని చంపుకోరు.  మృగాలైన సరే అలానే చేస్తాయి.  మరి మనిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు.  ఇలా క్రూరమైన ఆలోచనలు చేస్తున్నాడు.  


మనిషి డబ్బుకు బానిసగా మారాడు.  లక్షలు పెట్టి చదువుకున్నాం కాబట్టి ఆ లక్షలు తిరిగి రావాలి అంటే.. దానికి తగ్గట్టుగా వసూలు చేయాలి.  పవిత్రమైన వైద్య వృత్తిని కూడా వాళ్ళు వ్యాపారంగా మార్చుకున్నారు. ఫార్మా కంపెనీలు ఇచ్చే డబ్బులకు ఆశ పది వాటిని పాపం అభం శుభం తెలియని పసిపిల్లలపై ప్రయోగిస్తూ.. వారిని జంతువులకంటే దారుణంగా బాధలు పెడుతున్నారు.  ఏదోలా నీలోఫర్ లో జరుగుతున్న ట్రయల్ క్లినికల్ విషయాలు బయటకు వచ్చాయి.  


అవి అలా బయటకు రాకుండా ఉన్నట్టయితే.. దారుణం జరిగిపోయి ఉండేది.  పిల్లల జీవితాలతో ఇంకా అడ్డంకులు వస్తుండేవి.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీలోఫర్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు.  ఒక్క నీలోఫర్ లో మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా లేదంటే.. మిగతా హాస్పిటల్స్ లో కూడా ఇలానే జరుగుతున్నాయా అన్నది తెలియాలి.  నీలోఫర్ విషయం బయటకు వచ్చిన తరువాత మిగతా ప్రభుత్వ హాస్పిటల్స్ పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి.  


సమాచారం ప్రకారం దాదాపు 50 మంది పిల్లలపై ట్రయల్ క్లినికల్ నిర్వహించారంటే.. అర్ధం చేసుకోవచ్చు పిల్లల ప్రాణాలకు ఎలాంటి విలువ ఇస్తున్నారు.  ఇదే విధంగా ఒక కార్పొరేట్ హాస్పటల్ లో జరిగితే చూస్తూ ఊరుకుంటారా.. అలా చేసేందుకు సాహసిస్తారా.. ఎందుకంటే ప్రభుత్వం హాస్పిటల్స్ కాబట్టి ఎవరూ పట్టించుకోరు అనే ధీమా వాళ్లలో ఉన్నది.  అందుకే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: