పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల నుండి వెన్నునొప్పితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో గాయం అయినప్పటినుండి పవన్ వెన్నునొప్పితో బాధ పడుతున్నారని సమాచారం. ఆ తరువాత వెన్నునొప్పి తగ్గినా కొన్నిరోజుల క్రితం తిరగబెట్టటంతో పవన్ కళ్యాణ్ వెంటనే డాక్టర్లను కలిశారు. ఈ వెన్నునొప్పి కారణంగానే పవన్ కళ్యాణ్  రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా హాజరు కాలేదు. 
 
ఈ వెన్నునొప్పి కారణంగానే పవన్ ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా కొంత వేగం తగ్గించాడని తెలుస్తోంది. గతంలోనే పవన్ కళ్యాణ్ కు డాక్టర్లు వెన్ను నొప్పికి సర్జరీ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. కానీ పవన్ సర్జరీ వైపు మొగ్గు చూపలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెన్నునొప్పి సమస్య గురించి డాక్టర్లను కలవటం జరిగింది. డాక్టర్లు పవన్ కళ్యాణ్ కు వెన్నునొప్పికి సంబంధించిన పరీక్షలను నిర్వహించారు. 
 
పరీక్షల తరువాత వెన్నునొప్పి మరింత ఎక్కువ కాకముందే సర్జరీ చేయించుకోవాలని చెప్పారని సమాచారం. కానీ పవన్ సర్జరీ వైపు మొగ్గు చూపకుండా ప్రకృతి వైద్యంతో నొప్పిని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కొంతకాలం పాటు ఈ వైద్యం కొరకు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలకు దూరం కాబోతున్నారని తెలుస్తోంది. పవన్ కొన్ని రోజులపాటు జనసేన పార్టీకి  అందుబాటులో ఉండరని సమాచారం అందుతోంది. 
 
పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ప్రచార సమయంలో చాలా ప్రాంతాలకు వెళ్లాడు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వెన్నునొప్పిని అశ్రద్ధ చేశాడు. పవన్ కళ్యాణ్ అశ్రద్ధతో గాయాల నొప్పి తీవ్రత మరింతగా పెరిగింది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత సినిమాలకు పూర్తిగా దూరమై రాజకీయాలలోనే కొనసాగుతున్నాడు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయటం కొరకు కృషి చేస్తున్నాడు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: