ప్రపంచంలో అన్నింటికీ ఆదిమూలమైన భాష సంస్కృతం. అందులో సందేహం అవసరం లేదు.  సంస్కృత భాషనుంచే అనేక భాషలు ఏర్పడ్డాయి.  ఇక ప్రాచీన భాషల్లో మరొక భాష కూడా ఉన్నది.  అదే తమిళం.  తమిళం భాష ప్రాచీన భాషల్లో ఒకటి.  ఆ భాష నుంచి ఎన్నో గొప్పగొప్ప గ్రంధాలు వెలువడ్డాయి.  ఎందరో గొప్పగొప్ప కవులు, రచయితలు ఎన్నో కవితలు, పద్యాలు రాశారు.  అందుకే తమిళులకు వారిభాషపై మక్కువ ఎక్కువ.  


అలాంటి తమిళాన్ని వారు ఎప్పుడు వదిలిపెట్టరు.  మోడిసైతం ఇటీవలే ఐరాసలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తన ప్రసంగంలో తమిళం గురించి, తమిళ కవి చెప్పిన మాటలను గురించి మాట్లాడారు.  అది తమిళభాష గొప్పదనం అంటే.  కాగా, ఇటీవలే తమిళానాడులోని మద్రాస్ ఐఐటి స్నాతకోత్సవంలో మోడీ పాల్గొన్నారు.  ఐఐటి విద్యార్థులను గురించి మోడీ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.  


యువతలో స్ఫూర్తిని నింపింది.  భారత ఆర్ధిక వ్యవస్థ, అభివృద్ధి మీ చేతుల్లోనే ఉన్నాయని మోడీ చెప్పారు.  ఇది నిజంగా వారిలో స్ఫూర్తిని నింపే మాటలే అని చెప్పాలి.  అంతేకాదు, ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష తమిళం అని కూడా మోడీ చెప్పడంతో అక్కడి వారిని ఆ మాటలు బాగా ఆకట్టుకున్నాయి.  దీంతో గత కొన్ని రోజులుగా హిందీ భాషను రుద్దాలని చూస్తున్న కేంద్రంపై విరుచుకుపడిన తమిళ ప్రజలు శాంతించారు.  ఇది ఒకవిధంగా మంచిపనే అని చెప్పాలి.  


అయితే, మోడీ చేసిన ప్రసంగం గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. తాను ఊటీ బోర్డింగ్ స్కూల్ లో చదువుకున్నానని, కానీ తమిళంఅంతటి ప్రాచీన భాష అని ప్రధాని మోడీ చెప్పేవరకు తెలియదని, ఊటీలో చదువుకున్నా ఆ భాషను నేర్చుకోలేకపోయానని బాధపడ్డారు.  తమిళం తప్పకుండా నేర్చుకుంటానని మరోసారి ఆనంద్ మహీంద్రా చెప్పడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: