ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ భదౌరియా పాకిస్తాన్ ను హెచ్చరించాడు. పాకిస్తాన్ చొరబాట్లు ఆపకపోతే బాలాకోట్ దాడులు రిపీట్ అవుతాయని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయటానికి పాకిస్తాన్ చేస్తున్న ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఐదుగురు పాక్ కమాండోలు భారత్ లోకి రావటానికి ప్రయత్నాలు చేస్తుండగా భారత బలగాలు సెప్టెంబర్ 10వ తేదీన వారిని హతమార్చారు. 
 
భారతదేశంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయాలని పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్నట్లు తెలుస్తోంది. కానీ పాక్ ఎన్ని కుట్రలు చేస్తున్నప్పటికీ భారత సైన్యం మాత్రం నిఘా పెట్టి పాక్ ప్రణాళికలకు చెక్ పెడుతోంది. భారత నిఘా సంస్థలు ఇప్పటికే పాక్ ఆర్మీ ఉగ్రవాదులతో కలిసి చేస్తున్న కుట్రలను బయట పెట్టింది. నిఘా సంస్థలు 31 ప్రాంతాలలో ఒప్పందాలను ఉల్లంఘించి పాక్ సైన్యం ఉగ్రవాదుల చొరబాట్లకు సహకరిస్తుందని గుర్తించాయి.  
 
ఉగ్రవాదులకు పాక్ సైన్యం బంకర్లలో ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఇప్పటికే చాలాసార్లు వార్తలు వినిపించాయి. పాకిస్తాన్ కూడా భారత్ తో యుద్ధానికి సిద్ధం అన్నట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెబుతోంది. భారత్ ను సైనిక పరంగా అడ్డుకునే శక్తి లేదని పాక్ కు కూడా తెలుసు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి భారత త్రివిధ దళాలు కూడా సన్నద్ధమవుతున్నాయి. భారత రక్షణ శాఖ ఈ విషయం గురించి గత నెలలో ఒక వర్క్ షాప్ కూడా నిర్వహించిందని సమాచారం. 
 
భారత వాయుసేన పూల్వామా దాడి ప్రతీకార చర్యలలో భాగంగా ఫిబ్రవరి నెలలో బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశారు. పాక్ లో కార్యకలాపాలు జరుగుతున్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశారు. మిరాజ్ 2000 ఫైటర్ జెట్ లతో 21 నిమిషాల పాటు బాంబుల వర్షం కురిపించింది భారత వాయుసేన. భారత వాయుసేన ఈ దాడులలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: