సినిమాల్లో పంచ్ డైలాగులు రాయడానికి చాల కష్టపడుతుంటారు రచయితలు.....! ఇక మన జబర్దస్త్ కమెడియన్ల కష్టాలే వేరు...! కానీ ఇప్పుడు పంచు డైలాగులకి, పవర్ ఫుల్ స్క్రిప్ట్లకి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారింది సోషల్ మీడియా.అది కూడా ఏ కమెడియన్, రైటర్స్ రాసింది కాదండోయ్......అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు వేసుకుంటున్న మాటల తూటాలు.ఇప్పడు ఏపీలో వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్య  అదే నడుస్తోంది. 


సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు  దుమ్మెత్తిపోసుకుంటు పోస్టులుపై పెడుతున్నారు ఇరు పార్టీల నేతలు.అక్కడితో ఆగకుండా ఒకరిపై ఒకరు పోటా-పోటీగా పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.
అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నైతిక విలువలు పాటించాలి, అసత్యాలు  రాయొద్దంటూ.....హెచ్చరించారు.ఈ  ట్వీట్లకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నఒక రేంజ్ లో కౌంటరిచ్చారు.అసభ్య దూషణలుంటే ఫేస్ బుక్ కి ఫిర్యాదు చెయ్యాలా? మరి నువ్వు, మీ జగన్ ప్యాంటు తడుపుకుంటున్నారెందుకు? అంటూ కౌంటర్ ఇచ్చారు. 


 అనాగరిక దూషణలు లేకపోయినప్పటికీ మేము పెడుతున్న పోస్టులకు వణుకు పుట్టి దొంగ కేసులు పెట్టి అరెస్టు చేసే అవసరం ఎందుకొచ్చిందో చెప్తావా శకుని మామా?’అంటూ ప్రశ్నించారు.
‘అనాగరిక పోస్టులకు, అసభ్యకరమైన రాతలకు తండ్రి అయిన నువ్వు సోషల్ మీడియా విలువలు గురించి మాట్లాడటం కామెడీ గా ఉందన్నారు.  సిగ్గు,లజ్జా లేని బ్రతుకుల జాబితాలో నువ్వు, మీ జగన్ గిన్నిస్ బుక్ లో ఎక్కారు. అవినీతి కేసుల్లో 16 నెలలు జైలుకెళ్లిన నువ్వు పత్రికా విలువల గురించి మాట్లాడటం,మీ నల్ల పేపర్, నికృష్టపు ఛానెల్ గురించి గొప్పలు చెప్పుకోవడం ఏంటి’అని రెచ్చిపోయారు.


‘అబద్దాలు, కుట్రపూరిత వార్తలు తప్ప ఒక్క నిజాన్ని కూడా నీ పేపర్లో ప్రచురించని నీకు నైతిక విలువలంటూ  వేరే పత్రికల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది శకుని మామా?  అక్కడికేదో దేశంలో ఉన్న పత్రికలన్నింటికీ నువ్వే సలహాదారు అయినట్లు చెప్తున్నావ్ ! సోషల్ మీడియాని భ్రష్ఠు పట్టించిన ఘన చరిత్ర మీది శకుని మామా!  పేటీఎమ్ లో డబ్బులు వేసి పోస్టులు పెట్టించుకొని లైకులు కొట్టించుకునే దౌర్భాగ్యం నీది, మీ జగన్‌ది.  మీ అబద్ధపు బతుకులు టిడిపి సోషల్ మీడియా వాలంటీర్ల ద్వారా బయటపడుతున్నాయని వణుకు వస్తోందా?’అంటూ మరో ఘాటు ట్వీట్లు చేశారు.
ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగే లా లేదు....! చూద్దాం దీనికి కౌంటర్ గా శకుని మామ అదే నండి మన విజయసాయిరెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: