ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని మోదీతో భేటీ సమావేశం సందర్భంగా ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీల గురించి జగన్ ప్రస్తావించనున్నారు. పీపీఏలు, పోలవరం తదితర అంశాలు ప్రస్తావనకు వస్తాయి అని వైస్సార్సీపీ వర్గాలు చెప్పకనే చెబుతున్నాయి. అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభిచ బోతున్న జగన్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పథకానికి వైఎస్ఆర్ రైతు భరోసా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.12500 అందజేస్తుండగా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నుంచి వచ్చే రూ.6 వేలను కూడా అందులో కలుపుతారు అని తెలుస్తుంది. దీంతో ఈ పథకానికి మోదీ పేరు పెట్టాలని జగన్‌ను రాష్ట్ర బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

అయితే ఇప్పుడు బీజేపీ జగన్ తనపై కూడా అలాంటి విమర్శలే ఎక్కుపెట్టే అవకాశం ఉండటంతో జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ పథకానికి ప్రధాని మోదీ పేరు కూడా జత పర్చేందుకు ఆయన సన్నద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని మోదీకి తెలిపి పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆయన కోరనున్నారట. జగన్ ప్రతిపాదనకు మోదీ ఓకే చెపితే  బీజేపీ నేతలు ఈ విషయంలో జగన్‌ను విమర్శించడానికి ఛాన్స్ దొరకదు.

వైఎస్ఆర్ భరోసాకు మోదీ పేరును జత చేయడం ద్వారా తనకు, చంద్రబాబుకు ఎంతో తేడా ఉందని జగన్ పరోక్షంగా చెప్పినట్టే అని తెలిసి పోతున్నది. అటు టీడీపీ నేతలపై విమర్శలు చేయడంతోపాటుగా ఇటు బీజేపీ నేతల నోళ్లు మూయించడానికి జగన్ ప్రభుత్వ నిర్ణయం ఉపకరిస్తుంది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ మోదీ రైతు భరోసా అని ఈ పథకానికి పేరు పెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీతో భేటీ తర్వాత పేరు తెలిపే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ మొత్తానికి జగన్ రాజకీయ చాణక్యం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: