గత రెండురోజులుగా రాష్ట్రంలో విపరీతంగా వినిపిస్తున్న మాట ఆర్.టి.సి. సమ్మె. సాధారణంగా రోడ్ రవాణా వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఆదాయం బలపడుతుంది అనే మాట రాను రాను ఒక అపోహలానే మారనుంది. దీనికి నిదర్శనం నేటి ఆర్టీసీ సమ్మె...

ఒకవైపు పండుగ వాతావరణం... మరో వైపు బస్సుల బంద్... ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ మెట్రో వ్యవస్థకు "పైసా వసూల్" అనే చెప్పుకోవాలి.ఎన్నడూ లేని విధముగా నేడు మన జంట నగరాల్లో మెట్రోరైలు మాత్రం ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలు చొప్పున రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు.తెలంగాణలో ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగడం... ఒక్క బస్సు కూడా రోడ్డు ఎక్కకపోవడం... ఉదయాన్నేఆఫీసులకు వెళ్లేవారు, దసరా పండగలకు ఊళ్లకు వెళ్లేవారు నానా అవస్థలు పడుతుండటం... వీటన్నిటి దృష్ట్యా మెట్రోరైల్వే వారు మాత్రం ఓ అడుగు ముందంజలోనే వున్నారు.

హైదరాబాద్‌ టీ.ఎస్.ఆర్టీసీ సమ్మెతో నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా... పండుగ వేళ ఊళ్లకు వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకుని.... మెట్రో వేళలను సవరించారు. అర్థరాత్రి నుంచి ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలు చొప్పున రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు. నగరవాసులు ఈ వసతిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆర్.టి.సి. లేకపోతేనేం... మెట్రోరైలు వుందిగా..!!అన్న మాదిరిగా దీంతో పొద్దున్నుంచి మెట్రో రైలన్నీ రద్దీగా మారాయి. దాంతో ఎప్పుడు మెట్రో ఎక్కని వారు కూడా మొదటిసారి మెట్రోరైలు ఎక్కుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రయాణికుల రద్దీతో ప్రయాణం కాస్త అసహనంగా మారినప్పటికిని గమ్యాన్ని చేరుకుంటున్నందుకు సంతోషిస్తున్నారు. ఏది ఏమైనా బస్సులు త్వరగా రోడ్ ఎక్కాలని  ఆశిద్దాం...


మరింత సమాచారం తెలుసుకోండి: