ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన ఒకే అంశం పై చర్చావేదికలు. అది ఏదో కాదు మహారాష్ట్ర ఎన్నికల విషయమే. ఇప్పుడు ఈ ఎన్నికలు మహారాష్ట్రలో చాలా సీరియస్ గా తీసుకున్నాయి రాజాకీయ పార్టీలు. ఇక అసలు విషయానికి వస్తే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, శివసేన కూటమి 200కుపైగా సీట్లు గెలుచుకోవడం ఖచ్చితం అని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తేల్చిచెప్పారు.


 బీజేపీ, శివసేన మిత్ర కూటమిలో పెద్దన్న అంటూ ఎవరూ లేరని అన్నారు. జవదేకర్‌ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రెండు నెలలవుతున్నా కాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. తాము రెండు నెలల్లో బీజేపీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించామని చెప్పారు. అన్ని రాష్ట్రాలలో భారీస్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని, 8 కోట్ల మందిని కొత్తగా తమ పార్టీలో చేర్చుకున్నామని తెలిపారు. బీజేపీ సభ్యుల సంఖ్య 19 కోట్లకు చేరిందని అని ఈ సందర్బంగా తెలియ చేశారు. 


ఒక పక్క 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తమ కూటమి 200కుపైగా స్థానాలు గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అయన ఈ ముఖంగా తెలియచేసారు. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీ టిక్కెట్టు నిరాకరణకు గురైన అభ్యర్థులకు న్యాయం చేస్తామని ఉద్ధవ్‌ తెలిపారు. తనని కలిసిన సామాజికవర్గాల నాయకులు సీట్లు కావాలని కోరలేదనీ, కేవలం తమ డిమాండ్ల సాధనకు తమ పక్షాన నిలవాలని మాత్రమే  కోరారనీ ఆయన వెల్లడించారు. 


జరగబోయే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించని నాయకులు కూడా ఆయా సామాజిక వర్గాల కోసం పనిచేయాలని ఆదేశించారు. వారందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఓబీసీ నాయకుడు ప్రకాష్‌ షిండే మాట్లాడుతూ తమకు న్యాయం చేస్తామని శివసేన హామీ యిచ్చిందని వెల్లడించారు. ఇక చూడాలి మహారాష్ట్రలో ఎవరికీ ఎన్ని సీట్స్ వస్తాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: