దసరా - విస్తారపరిస్తే దశ + హరా – పది రోజులు అని అర్ధం వస్తుంది. ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తాం. ఏటా నవరాత్రి వేడుకలు - ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు, తొమ్మిది రోజులు ముగిశాక – పదో రోజు దశమి నాడు  దసరా లేక విజయ దశమి పర్వదినం జరుపు కుంటున్నాం.  ఈ రోజున దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో భిన్న విభిన్న సంప్రదాయాలు, సంస్కృతులు ఆచారాలతో పూజాధికాలు నిర్వహిస్తారు.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DUSSEHRA' target='_blank' title='dussehra-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>dussehra</a> - winning over evil

ఉత్తరాది, దక్షిణాదిలో దసరా అంటే రామాయణంలో రావణుడిపై శ్రీరాముడి విజయానికి చిహ్నంగా జరుపు కుంటారు. అలాగే తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో దసరా అంటే మహిషాసురుడిపై దుర్గాదేవి కాళిమాత రూపంలో సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటూ దుర్గమ్మకు వివిధ రూపాల్లో పూజలు చేశాక, పదో రోజున దసరా వేడుకలతో ఈ పండుగ ముగుస్తుంది.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DUSSEHRA' target='_blank' title='dussehra-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>dussehra</a> - winning over evil

ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు ప్రపంచం లోని హిందువులందరికీ పరమ పవిత్రమైనవి. ఆ తొమ్మిది రోజులు దేవాలయాలలో అమ్మవారిని రోజుకొక్క అవతారంగా అలంకరించి ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు. చాలామంది వారి వారి గృహాలలో కూడా ఏరోజు ప్రత్యేక నైవేధ్యం ఆరోజు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి పూజిస్తారు. 


మన శాస్త్రాలలో ఏదైనా చెప్పాలంటే దానికి ఎంతో అర్ధం, పరమార్ధం ఉంటాయని చెప్పనక్కరలేదు. అలాగే అమ్మవారి వస్త్రాలంకరణలు, ప్రత్యేక నైవేద్యాలలో ఎంతో నిగూడార్ధం ఇమిడి ఉన్నది.

స్త్రీలను ఆదిశక్తి అవతారంగా భావిస్తారు. ప్రతి స్త్రీలోనూ సందర్భానుసారంగా అమ్మవారి తొమ్మిది అవతారాలలోని లక్షణాలు ప్రస్పుటంగా కనబడుతూ ఉంటాయి.

ఉదాహరణకు మన స్త్రీలలో అన్నపూర్ణాదేవిలోని ప్రసన్నతను, దుర్గాదేవిలోని ఉగ్ర స్వరూపాన్ని పలు సందర్భాలలో గమనిస్తూ ఉంటాం.

” అతివ అనుగ్రహిస్తే అమ్మ - ఆగ్రహిస్తే అంబ “ అనటం వింటూనే ఉంటాం.

Image result for ఆది పరాశక్తి

ఇక అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు వాడే వస్త్రాల వర్ణాల విషయం గమనిస్తే ఆ దేవి యొక్క అవతారాలలోని ఆయా గుణాలు ప్రతిబింబించెటట్లుగా ఆ వస్త్రాలంకరణకు వాడే ఆ చీర యొక్క రంగు ఉంటుంది.


ఉదాహరణకు దుర్గాదేవి అవతారంగా అమ్మవారికి ఎరుపు వర్ణం చీరను ధరింపజేస్తే, బాలా త్రిపుర సుందరిగా పసుపువర్ణ చీర అలంకరింపజేస్తారు. ఎరుపు శక్తిని ప్రతిబింబిస్తే, పసుపు సంతోషాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిని బట్టి ఈ వస్త్రాల రంగులు మన మానసిక స్థితి మీద చూపే ప్రభావాన్ని తెలుసుకొని మన దైనందిన జీవితంలో ఉపయోగించుకొంటే మన జీవితాన్ని ఆహ్లాదంగా గడపవచ్చు.


ఇప్పుడు ఏయే వర్ణాలు మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకొందాం.

నారింజ వర్ణం స్థిరత్వం,

ఎరుపు - శక్తి, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. త్వరగా నిర్ణయాలు తీసుకొనేటట్లు చేస్తుంది.

నీలి వర్ణం - సంపద, నమ్మకం, స్వస్తత లేదా ఆరోగ్యం పెంపొందిస్తుంది - ఆకలిని తగ్గిస్తుంది

గులాబి వర్ణం - శృంగార ప్రకోపం

తెలుపు వర్ణం - స్పటికం అంత స్వచ్చత, శాంతి, అమాయకత్వం

పసుపుపచ్చ వర్ణం - సంతోషం, తెలివి, ఉల్లాసం

ఆకుపచ్చ వర్ణం - విశ్రాంతి, ప్రకృతి

పసిడి వర్ణం - జ్ణానం, సంపద, వెలుగు

Image result for ఆది పరాశక్తి

*శరదృతువులో జరుపుకునే దేవీ నవరాత్రులు వీటిని శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఈ రోజుల్లో పున్నమి వెన్నెల వెన్న ముద్దలా వెల్లివిరుస్తుంది. పూర్వకాలంల్లో దేవాలయాల్లోనే సమావేశాలు జరిగేవి. కనుక ఈ నవరాత్రులు వెన్నెల రోజులు కాబట్టి దేవాలయాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో, క్రీడాభిరామాలయ్యేవి.

*వీటన్నిటికి కావలసింది శక్తి. కాబట్టి ఆయా నైవేద్యాలలో నెయ్యి, పాలు, తేనె, పంచదార, పండ్లు, పిండి పదార్దాలతో ఎక్కువగా చేసేవారు. ఇవన్నీ సమపాళ్ళలో తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

*శాస్త్ర విజ్ణానాన్నిఇలా సామాన్య ప్రజానీకానికి పరిచయం చేయడమే పండుగల పరమార్ధం. వినాయక చవితి ద్వారా ప్రకృతి వైవిద్యాన్ని మనకు పరిచయం చేసినట్లే, దేవీ నవరాత్రుల ద్వారా మనకు మనస్తత్వశాస్త్రాన్ని పరిచయం చేశారు.

*దసరా పండుగ నాడు ఉత్సవాలు కాస్త భిన్నంగానే ఉంటాయి. తొమ్మిది రోజుల పాటూ, దుర్గమ్మ విగ్రహాలకు పూజలు చేశాక, పదో రోజున అమ్మవారి విగ్రహాల్ని చెరువులు, నదుల్లో నిమజ్జనం చేస్తారు. అదే సమయంలో రావణాసురుడి దిష్టిబొమ్మలను తగలబెడతారు. ఆయనతోపాటూ, ఆయన సోదరుడైన కుంభకర్ణుడు. కుమారుడైన ఇంద్రజిత్తు దిష్టిబొమ్మల్ని కూడా తగలబెడతారు.

*దసరా, విజయదశమిలో దేశవ్యాప్తంగా వేర్వేరు ఆచారాల్ని పాటిస్తున్నా, అన్నింటి సందేశమూ ఒక్కటే. చెడుపై మంచి విజయం. చెడు ఎప్పటికీ గెలవదు. మంచి ఎప్పటికైనా గెలిచి తీరుతుందనే. దసరా నాడు రామలీల మరో ప్రత్యేకత. ఇందులో భాగంగా శ్రీరాముడి జీవిత కథను, పాటలు, నాటకాల రూపంలో ప్రదర్శనలిస్తారు. తద్వారా యువతకు, ముందు తరాల వారికీ, దసరా చరిత్ర తెలుస్తుంది.

*ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుకల్లో దసరా ప్రత్యేకమైనది. వారణాసిలో, శ్రీరామ కథను నెలరోజులపాటూ, రోజూ వినిపిస్తారు. అక్కడి రామనగర్‌ లో జరిగే రామలీల 31 రోజుల పాటూ కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ సంప్రదాయ ఆచారాన్ని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో, భారతీయ వారసత్వ సంపదగా గుర్తించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: