ప్రశ్నించడానికే కాదు... పోరాటానికి సైతం.. జనసేన అన్న తీరుగా నేడు మన పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారంపై స్పందించారు. నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో సరళపై ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడి చేసిన తీరు..,,, గతంలో కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్‌ అయిన వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడి చేయించిన ఘటనను గుర్తుకు తెచ్చిందని కళ్యాణ్ గారన్నారు. నాడు వనజాక్షి.. నేడు సరళ.. విరీవురు బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్నప్పటికిని ప్రజా ప్రతినిధుల ఆరాచకలకి గురికాక తప్పట్లేదని..,, విధి నిర్వహణలోని మహిళా ఉద్యోగులపైనే ఇలా తెగబడి దాడులు చేస్తుంటే.. ఇక సామాన్య మహిళల మాటేంటని...,,, ఈ దాడిని అధికార పార్టీ ఎందుకు ఖండించడం లేదని..,, శ్రీధర్‌ రెడ్డిపై తీవ్రమైన చర్యలకు ఎందుకు డిమాండ్‌ చేయడం లేదని జనసేన నేత నిలదీశారు. 

 

ఎంపీడీవో సరళ పెట్టిన క్రిమినల్‌ కేసును నిర్వీర్యం చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సందేశాన్నిస్తుంది? మా శాసన సభ్యులు దాడులు చేస్తారు.. మీరు భరించండి అనే సంకేతాలిస్తోందా? ప్రజాప్రతినిధులే చట్టాన్ని గౌరవించకపోతే చట్టానికి విలువ ఎక్కడ నుంచి వస్తుంది? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

 

‘‘ప్రతిపక్ష నేతలు ప్రజా సమస్యలపై రోడ్డెక్కి నిరసన గళం విప్పితే.. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు, ఒక్కోసారి 307 వంటి హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు... ఇది వాస్తవం.. కానీ ఒక మహిళా ఉద్యోగిపైన దాడి చేసిన శాసన సభ్యుడు కోటంరెడ్డిపై మాత్రం బెయిల్‌ సులువుగా ఇచ్చే 448, 427, 506, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. పోలీసుల ద్వారా ప్రభుత్వం నీరు గార్చేసిందని...,, అసలీ సెక్షన్ల కింద నమోదయ్యే కేసులలో కేవలం స్వల్ప జరిమానా, లేదా నామమాత్రపు శిక్ష విధిస్తారు. నిజానికి ప్రభుత్వ అధికారి మీద దాడి చేసిన వారిపై 353, 354 సెక్షన్ల కింద బెయిల్‌ ఇవ్వడానికి వీలు లేనటువంటి కేసులు పెట్టాలి. కానీ పోలీసులు ఆ పనిని విస్మరించారు. దీనికి ప్రభుత్వ ఒత్తిడే కారణమని జనసేన భావిస్తోంది. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడవలసిన భాద్యత  ప్రభుత్వంపై వుందని..,, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ కోరుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: