గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని నిధుల కొరత గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ లోకేష్‌ కుమార్ సెప్టెంబర్‌ నెలలో రూ.65 కోట్ల ఆస్తిపన్నును సేకరించామని..,, ప్రస్తుతం నిధుల కొరత ఏ మాత్రం లేదని తెలిపారు.

నగరంలోని భారీ వర్షాల కారణంగా రోడ్ల మరమ్మతులకు ఆటంకం కలుగుతుందని..,, వరుసగా వర్షాలు కురవడంతో దెబ్బతిన్న రోడ్లు 160కు పైగా మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలతో మరమ్మతులు చేయిస్తున్నామని..,, నాలాల విస్తరణ గురించి ఆస్తుల సేకరణను వేగవంతం చేస్తున్నట్లుగా చెప్పారు.

వసూళ్లలో ఉన్న లోపాలను సవరించడం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు జీహెచ్‌ఎంసీ తగు ప్రణాళికల్ని రూపొందించనుందని..,, భవన నిర్మాణ అనుమతులను రెవెన్యూ విభాగానికి అనుసంధానం చేసి నిర్మాణం పూర్తయిన వెంటనే ఆస్తిపన్ను విధించేలా చర్యలు చేపడుతున్నామని., మదింపులో వ్యత్యాసాలను సరిచేయడం తదితర చర్యల ద్వారా ఆదాయ మార్గాలను పెంపొందించుతున్నట్టుగా కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు.  సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ వారం నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆస్తిపన్ను మదింపును పకడ్బందీగా చేపడుతామని..,, దానిని డీపీఎంఎస్ కు., జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగానికి అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు. 

50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్‌ కవర్లు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధాన్ని మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు..,, టీడీఆర్‌ వివరాలకు సంబంధించిన బ్యాంక్‌ సిద్ధంగా ఉందని, దీన్ని అక్టోబర్‌ 15న మంత్రి కేటీఆర్‌తో ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనాలకు నిర్మించిన ప్రత్యేక కొలనులను దోమల నివారణకు ఉపయోగపడే గంబూసియా చేపల ఉత్పత్తి కేంద్రాలుగా మారుస్తామని..,, ఈ చేపలను దాదాపు 160 చెరువులు, కుంటల్లో లార్వా నివారణకై వదలుతామని లోకేష్  పేర్కొన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ లో చెత్త నుండి విద్యుత్‌ ఉత్పత్తి చేసే వేస్ట్‌ టు ఎనర్జీ విద్యుత్‌ ప్లాంట్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉందని..,, అయితే ఆ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ ధరను నిర్ణయించాల్సిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్‌ కమీషన్‌ ఏర్పాటు అయిన వెంటనే ధరను నిర్ణయిస్తుందని, ఆ వెంటనే ఈ ప్లాంట్‌ను ప్రారంభించే అవకాశముందని లోకేష్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: