జీవిత ప్రయాణ దీశా-నిర్దేశ మార్గన్ని చూపడంలో ఉపాద్యాయునికున్న ప్రాముఖ్యత వేరు. అలాంటి ఉపాధ్యాయ వృత్తి కొందరి కల కూడా. ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెట్‌ నిర్వహణకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి విద్యా శాఖ వారు దాదాపు నాలుగు నెలల క్రితమే ప్రతిపాదనలు పంపించగా..,, ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ వుందని...,, దానితో అభ్యర్థులు ఈ పరీక్షపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని..,, మార్కులు పెంచుకునేందుకు గాను మళ్లీ మళ్లీ టెట్‌కు హాజరవుతున్నారని..,, ప్రైవేటు స్కూళ్లలో టీచర్‌గా పని చేసేందుకు కూడా టెట్‌ అర్హతను ప్రభుత్వం తప్పనిసరి చేసిందని..,, దానితో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు సైతం భారీ స్ధాయిలో టెట్‌ కోసం ఎదురుచూస్తున్నారని..,, దీనికి తోడు గతంలో నిర్వహించిన మూడు టెట్ల కాల పరిమితి ముగిసినది.. కాగా ఒకసారి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థికి ఏడేళ్ల వరకు కాల పరిమితి ఉంటుంది. ఒకవేళ ఆ కాలపరిమితి దాటిన పక్షాన మళ్లీ టెట్‌ పరీక్ష రాయాల్సి వుంటుందని...,, అధికారులు తెలిపారు...

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు సంవత్సర కాలంలో కేవలం రెండుమార్లు మాత్రమే (2016 మే 22న, 2017 జులై 23న) టెట్‌ పరిక్ష నిర్వహింహడం జరిగింది. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు నిర్వహించ వలసినది... కానీ, ప్రభుత్వం ఏడాదికి కేవలం ఒక్కమారే నిర్వహించేలా 2015 డిసెంబరు 23న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.. దాని ప్రకారమైనా 2018, 2019లోనూ టెట్‌ నిర్వహించాలని..,, రాష్ట్రంలో దాదాపుగా మూడు లక్షల మంది వరకు అభ్యర్థులు టెట్‌ కోసం ఎదురు చూస్తున్న సంగతి ప్రభుత్వం వారు గుర్తిస్తే చాలు....

మరింత సమాచారం తెలుసుకోండి: