రాష్ట్రంలో టెండర్ల ప్రక్రియను పూర్తిగా నిర్మిలించి అవినీతిరహితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాటైన ‘న్యాయపరమైన ముందస్తు సమీక్ష’కు ఏర్పాట్లు చకచకా పూర్తికానున్నాయి. ఏపీ మౌలిక సదుపాయాల చట్టాన్ని రాష్ట్రసర్కారు తీసుకురావడం, టెండర్లపై న్యాయ పరిశీలన బాధ్యతలకు గాను హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావుకు అప్పగించారు. అందుగ్గాను సచివాలయంలో సంబంధిత శాఖలని ఉన్నతాధికారులతో చర్చించి., సీఎస్‌ మాట్లాడుతూ జ్యుడీషియల్‌ ప్రివ్యూ జడ్జికి అవసరమైన సాంకేతిక, ఇంజనీరింగ్‌ నిపుణుల జాబితాలను సంబంధిత శాఖలన్నీ తక్షణం పంపించాలన్నారు. ఆ జాబితాల్లోని వారి గత రికార్డులపై విజిలెన్స్‌ నివేదికల్ని తీసుకోవడంతోపాటు ఎటువంటి మచ్చలేని ఖచ్చితమైన వారితోనే జాబితాలను పంపాలన్నారు. జ్యుడీషియల్‌ ప్రివ్యూ చట్టానుసారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఏజెన్సీలు// స్థానిక అధికారి రూ.100 కోట్లు..కుమించిన 'మౌలిక సదుపాయాల' ప్రాజెక్టులకు సంబంధించి టెండర్‌ ప్రక్రియకు వెళ్లేముందు సంబంధిత పత్రాలన్నింటినీ న్యాయపరమైన సమీక్షకోసం ముందుగానే న్యాయమూర్తికి సమర్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. 

 

‘స్పందన’కు ప్రామాణిక విధానాన్ని పాటించాలి., 

ఈ కార్యక్రమం కింద వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు అన్ని శాఖలూ ఒకే ప్రామాణిక విధానాన్ని(స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్‌) పాటించాలని జగన్ తేల్చిచెప్పారు. శుక్రవారం సచివాలయంలో ‘స్పందన’పై వర్క్‌షాప్‌ జరిగింది. ప్రజలనుంచి వచ్చే ‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారంలో అనుసరించాల్సిన ‘స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్‌’పై సంబంధిత శాఖల అధికారులకు సీఎస్‌ సూచనలిచ్చారు. ‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్‌ను సిద్ధం చేసి ఆ వివరాల్ని ప్రణాళికా శాఖకు అందించాలని., అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి గాను దశలవారీగా రూపొందించిన కాలవ్యవధి(టైమ్‌ లైన్‌)కి సంబంధించిన వివరాలను.., స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్‌ అందించాలన్నారు. వచ్చే ప్రతి ఫిర్యాదును సకాలంలో సక్రమంగా పరిష్కరించడంపై అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.., ప్రతి ఫిర్యాదు ఆమోదానికి ముందు - లబ్ధిదారు ఎంపిక.. తర్వాత సోషల్‌ ఆడిట్‌ తప్పనిసరన్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: